Maruti Suzuki కీలక ప్లాన్‌.. 5 కొత్త కార్ల విడుదలకు ప్రణాళికలు.. ఎప్పటికి విడుదల అవుతాయంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ( Maruti Suzuki ) 2031 నాటికి 5 కొత్త కార్లను విడుదల చేసేందుకు ప్రణాళిక వేస్తోంది. అలాగే 2025 నాటికి ఎలక్ట్రిక్‌ కారును పరిచయం చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు మారుతి సుజుకి ప్రెసిడెంట్‌ ఈ మేరకు తమ అంచనాలను వెల్లడించారు.

మైక్రో SUV : మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 2021లో టాటా నుంచి పంచ్‌ విడుదల అయింది. ఈ కారుకు పోటీ నిచ్చేందుకు ఈ సంవత్సరం హ్యుందాయ్‌ ఎక్స్‌టర్ విడుదల అయింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి ఇగ్నిస్ ఉన్నా.. సంస్థ ఆశించిన ఫలితాలు రాలేదు. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా, హ్యుందాయ్‌ కార్లకు పోటీనిచ్చేందుకు కొత్త కారును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

maruti celerio

రెండు హ్యాచ్‌బ్యాక్‌లు : మార్కెట్లో మారుతి అధిక సంఖ్యలో హ్యాచ్‌బ్యాక్‌లను కలిగి ఉంది. అయితే కొనుగోలుదారులు మరిన్ని ఫీచర్లు కోరుకోవడంతో మారుతి హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయాలు తగ్గుతున్నాయి. అందువల్ల మారుతి సెలెరియో, ఆల్టో స్థానంలో రెండు కొత్త హ్యాచ్‌బ్యాక్‌లు విడుదల చేసే అవకాశం ఉంది. వీటి ధరలు రూ.10 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది.

గ్రాండ్‌ విటారా సెగ్మెంట్‌లో.. : 2022 సెప్టెంబర్‌లో కంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో గ్రాండ్‌ విటారాను లాంచ్‌ చేసింది. అనంతరం ఈ సెగ్మెంట్‌లో మరో కారును మారుతి సుజుకి సంస్థ విడుదల చేయలేదు. ఈ సెగ్మెంట్‌ లోనూ మరో కారును లాంచ్‌ చేసేందుకు మారుతు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

Maruti suzuki upcoming cars

MPV సెగ్మెంట్‌లోనూ.. : మారుతి సుజుకి సంస్థ MPV ( మల్టీ పర్పస్ వెహికల్) సెగ్మెంట్‌లో ఎర్టిగా, XL6, ఇన్విక్టో సహా మరో మూడు ఎంపీవీలను కలిగి ఉంది. Xl6 మరియు ఇన్విక్టోల మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. ఈ రెండింటి ధరల మధ్య మరో కొత్త కారును తీసుకొచ్చేందుకు మారుతి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి సంస్థ మైక్రో ఎస్‌యూవీ, ఎంపీవీ, కంపాక్ట్‌ ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో విక్రయాలు పెంచుకొనే విధంగా కీలక ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా విక్రయాలు బలహీనంగా ఉన్న మరియు ప్రస్తుతం ఉన్న విక్రయాలను గణనీయంగా పెంచుకొనేందుకు రానున్న సంవత్సరాల్లో కొత్త వాహనాలను లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది.

Maruti suzuki latest news

ప్రపంచంలోని అతిపెద్ద వాహన మార్కెట్‌లో భారత్‌ కీలకంగా ఉంది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులను తెలుసుకోవడం ద్వారా విక్రయాల సంఖ్యను గణనీయంగా పెంచుకొనే అవకాశం ఉంది. మారుతి సంస్థ ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే సెగ్మెంట్‌ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, November 27, 2023, 11:35 [IST]
English summary
Maruti suzuki planing to launch new model cars by 2031
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+