మారుతి సుజుకి ఇగ్నిస్ ధర పెంపు.. ఆ ఫీచర్ల వల్లే రేటు పెంచినట్లు ప్రకటన

మారుతి సుజుకి ఇగ్నిస్‌ కారులు ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. కొన్ని కొత్త భద్రత ప్రమాణాలను జోడించి సరికొత్త ఫీచర్లతో కారును కంపెనీ అప్‌ డేట్ చేసింది. దీంతోపాటు ఈ మోడల్ ధరను కూడా పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్తగా అప్ డేట్ తో వస్తున్న ఇగ్నిస్‌ లో హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా రూ.27,000 వరకు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. తాజాగా పెంచిన ధరతో కలిపి ఇకపై ఈ కారు ధర రూ.5.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రారంభం కానుంది. ఈ ధరలు తక్షణమే అమలులోకి రానునట్లు తెలిపింది. తాజాగా ఆధునీకరించిన కారులో రివర్స్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) కంప్లైంట్, E20 ఇంధనాన్ని పొందుపరిచారు.

మారుతి ఇగ్నిస్

హిల్ హోల్డ్ అసిస్ట్..

ఆటో ఎక్స్‌పో 2020లో కొత్త ఇగ్నిస్ ను మారుతి సుజుకి ప్రజెంట్ చేసింది. కొత్త ఫీచర్లను తీసుకు రావడంతో ధరల పెరుగుదలకు దారితీసిందని సంస్థ పేర్కొంది. హిల్ హోల్డ్ అసిస్ట్‌ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి) వంటి భద్రతా ఫీచర్లతో ఇగ్నిస్‌ ను మరింత మెరుగ్గా తయారు చేసి తీసుకు వస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.

అలానే పిల్లల కోసం ABS, ISOFIX వంటి భద్రతా లక్షణాలను మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రత్యేకంగా ప్రవేశ పెట్టింది. 1.2-లీటర్ VVT పెట్రోల్ ఇంజన్‌ తో ఈ కారును సంస్థ తీసుకువస్తుంది.BS6 ఫేజ్ II కంప్లైంట్ నియమాల ప్రకారం ఈ వాహనాన్ని ఆధునీకరించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 హెచ్‌పి పవర్ వద్ద 113 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ లు ఈ కారులో జత చేయబడింది.

మారుతి సుజుకి

ఫీచర్లు ఇవే..

15-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ లైట్‌ లు, DRLలు, 7-అంగుళాల టచ్‌ స్క్రీన్ స్మార్ట్‌ ప్లే ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్ దీనికి అమర్చారు. Apple Car Play, Android Auto, డ్రైవర్ డిస్‌ ప్లేగా TFT స్క్రీన్‌ తో కూడిన MID, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, నాలుగు స్పీకర్లు మరిన్ని వంటి అనేక ఫీచర్లతో ఈ కారు వస్తుంది.

ఇక ఈ కారులోని కలర్స్ తొమ్మిది కలర్స్ లో 6 సింగిల్-టోన్, 3 డ్యూయల్-టోన్ ఉన్నాయి. కలర్ ఆప్షన్‌ లలో టర్కోయిస్ బ్లూ, లూసెంట్ ఆరెంజ్, నెక్సా బ్లూ, గ్లిస్టెనింగ్ గ్రే, సిల్కీ సిల్వర్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లాక్ రూఫ్‌తో నెక్సా బ్లూ ఇగ్నిస్, సిల్వర్ రూఫ్‌తో నెక్సా బ్లూ ఇగ్నిస్ బ్లాక్ రూఫ్‌తో లూసెంట్ ఆరెంజ్ లు ఉన్నాయి.

మారుతి సుజుకి

సేఫ్టీ ఫీచర్లపై మారుతి సుజుకి దృష్టి..

మారుతి సుజుకి తాజాగా అన్నీ కార్లను ఆధునీకరిస్తుంది. అందులో భాగంగా మారుతి సియాజ్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ తో పాటు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. మారుతి సుజుకి నెక్సా షోరూమ్ లల్లో 2023లో ఆధునీకరించిన కార్లను అందుబాటులో ఉంచింది. మరిన్నీ కార్లను కూడా సుజుకి మార్పులు చేర్పూ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఇదిలా ఉండగా, మారుతి సుజుకి ఇటీవల సెడాన్ టూర్ ఎస్‌ ను కూడా కారు అప్‌డేట్ చేసింది. కంపెనీ మారుతి సుజుకి టూర్ ఎస్ సెడాన్ 2023 మోడల్‌ ను ప్రకటించింది. ఫేస్‌ లిఫ్టెడ్ డిజైర్ కారు ఆధారంగా, 2023 మారుతి సుజుకి టూర్ ఎస్ పెట్రోల్, CNG వేరియంట్‌ లలో అందించబడుతుంది. పెట్రోల్ మోడల్ ధర 6.51 లక్షలు (ఎక్స్-షోరూమ్), CNG వేరియంట్ ప్రారంభ ధర 7.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 25, 2023, 21:36 [IST]
English summary
Maruti suzuki price hiked in india and added new safety features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+