87 వేలకు పైగా కార్లను రీకాల్‌ చేసిన మారుతి సుజుకి.. కారణమిదే..

దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి అతి పెద్ద వాహన తయారీదారుగా ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌ ధరలో కార్లను విక్రయిస్తూ వినియోగదారుల ఫేవరెట్‌గా ఉంది. మారుతి మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో రకాల మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. అయితే మారుతి సుజుకి తాజాగా కొన్ని వేల కార్లను రీకాల్‌ చేసింది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన S ప్రెస్సో(S Presso) మరియు ఎకో(Eeco) వ్యాన్‌లకు సంబంధించి 87,000 యూనిట్లను రీకాల్ చేసింది. ఈ కార్లలోని స్టీరింగ్ వీల్ సెటప్‌లో గుర్తించిన లోపం కారణంగా ఈ వాహనాలను రీకాల్ చేసినట్లు మారుతీ సుజుకి సంస్థ ప్రకటించింది.

Maruti-Cars

పలు లోపాల కారణంగా 87,000 కంటే ఎక్కువ కార్లను రీకాల్ చేస్తూ మారుతీ సుజుకి సోమవారం(జూలై 24), ఒక ప్రకటన విడుదల చేసింది. ఫాల్ట్‌లు ఉన్న మారుతి సుజుకి S ప్రెస్సో మరియు మారుతి సుజుకి ఎకో వ్యాన్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరించడానికి యజమానులు సమీపంలోని డీలర్‌ను సంప్రదించవచ్చునని సంస్థ తెలిపింది.

దాదాపుగా మారుతీ సుజుకి 87,599 యూనిట్ల S ప్రెస్సో మరియు ఎకో మోడళ్లను రీకాల్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ వాహనాల్లోని స్టీరింగ్ టై రాడ్ లోపభూయిష్టంగా ఉందని వాహనదారులు తెలిపారు. మారుతీ స్టేట్‌మెంట్ ప్రకారం, అటువంటి వాహనాల్లో ఉపయోగించే స్టీరింగ్ టై రాడ్‌లో ఒక భాగంలో ఫాల్ట్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

Maruti-Eeco

ఇది అరుదైన సందర్భాల్లో, కారు స్టీరబిలిటీ మరియు నిర్వహణపై ప్రభావం చూపుతుందని సంస్థ తెలిపింది. S ప్రెస్సో మరియు ఎకో మోడల్‌లు జూలై 5, 2021 మరియు ఫిబ్రవరి 15 మధ్య తయారయ్యాయి. ఇటీవలి కాలంలో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ చేసిన అతిపెద్ద రీకాల్‌లలో ఇది ఒకటిగా సమాచారం.

మోటార్ జనరేటర్ యూనిట్‌లో లోపం కారణంగా.. రెండేళ్ల క్రితం మారుతి సుజుకి సియాజ్, విటారా బ్రెజ్జా మరియు XL6 పెట్రోల్ వేరియంట్‌లతో సహా వివిధ మోడళ్లలో దాదాపు 2 లక్షల యూనిట్లను కంపెనీ రీకాల్ చేయాల్సి వచ్చింది. గతేడాది మారుతి 1.34 లక్షల వ్యాగన్ఆర్ మరియు బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లను ఫ్యూయల్ పంప్‌లలో తప్పుగా ఉండటంతో రీకాల్ చేసింది.

Maruti-Eeco

ఈ మారుతి ఎకో వాన్ కొత్త 1.2 లీటర్ అధునాతన K సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్‌తో మరింత శక్తివంతమైనది. అంతేకాకుండా అధిక మైలేజీని ఇస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 80.76 bhp శక్తిని మరియు 3,000 rpm వద్ద 104.4 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ మారుతి సుజుకి ఎకో వ్యాన్ CNG కిట్‌తో కూడా అందుబాటులో ఉంది. CNG మోడ్‌లో, ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 71.65 bhp శక్తిని మరియు 3,000rpm వద్ద 95 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్స్‌కు పవర్‌ సరఫరా అవుతుంది. మారుతి సుజుకి ఎకో వ్యాన్ టూర్ వేరియంట్ 20.20 kmpl మైలేజీని అందిస్తుంది.

Maruti-S-Presso

మారుతి సుజుకి S ప్రెస్సో మొదటిసారిగా 2019 లో లాంచ్‌ అయింది. వివిధ వేరియంట్లను బట్టి దీని ధర ఎక్స్‌షోరూమ్‌లో 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంది. ఇది ఆల్టో కె 10 మోడల్స్‌లో ఉపయోగించిన అదే 1.0 పెట్రోల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

మారుతి సుజుకి S ప్రెస్సో 1.0-లీటర్ మూడు-సిలిండర్ K10C DualJet పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 66 bhp శక్తి వద్ద 90Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. మైక్రో-SUV CNG డ్రైవ్‌ట్రెయిన్‌తో కూడా ఈ కారు అందుబాటులో ఉంది.

Maruti-S-Presso

More from DriveSpark

Article Published On: Tuesday, July 25, 2023, 17:45 [IST]
English summary
Maruti suzuki recalls over 87000 s presso and eeco cars full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+