New Gen Swift కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ వచ్చేసింది.. 40 కి.మీ మైలేజ్‌తో ఇక ప్రత్యర్థులకు గట్టి పోటీ.!!

భారత మార్కెట్లో కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న కార్లలో ఒకటి 2024 మారుతి స్విఫ్ట్. మోస్ట్ ఎవైటెడ్ కార్లలో ఒకటిగా ఉన్న స్విఫ్ట్‌.. భారీ అంచనాలను కలిగి ఉంది. కారణం ఇప్పటికే భారత్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్‌ అత్యంత ప్రజాదరణ పొందింది. కాగా కొత్త వెర్షన్‌లో అనేక అధునాతన మార్పులకు గురైన సుజుకి స్విఫ్ట్‌ ఇప్పుడు జపాన్‌లో లాంచ్‌ అయింది.

కాగా 2024 మారుతి సుజుకి స్విఫ్ట్(2024 Maruti Suzuki Swift) మోడల్ 9 సింగిల్-టోన్, నాలుగు డ్యూయల్-టోన్ ఆప్షన్‌లతో సహా మొత్తం 13 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లతో విడుదలైంది. ఫ్రాంటియర్ బ్లూ, కూల్ ఎల్లో, కారవాన్ ఐవరీ, ప్యూర్ వైట్, ప్రీమియం సిల్వర్, స్టార్ సిల్వర్, ఫ్లేమ్ ఆరెంజ్, సూపర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

Maruti-Suzuki-Swift-2024

ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లను పరిశీలిస్తే ఫ్రాంటియర్ బ్లూ, బర్నింగ్ రెడ్, కూల్ ఎల్లో, ప్యూర్ వైట్‌లలో కొత్త స్విఫ్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇంటీరియర్‌ను పరిశీలిస్తే.. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్లైమేట్ కంట్రోల్, ఫ్లోటింగ్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌, స్టార్ట్-స్టాప్ బటన్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్‌ పాత వెర్షన్‌తో పోలిస్తే.. 2024 స్విఫ్ట్‌ను డిజైన్, ఇంజిన్‌, ఫీచర్ల పరంగా చాలా అప్‌డేట్లతో ప్రవేశపెట్టారు. డిజైన్‌ను పరిశీలిస్తే.. మారుతి స్విఫ్ట్ ముందు భాగంలో చిక్ గ్రిల్, ఎల్-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు), C-ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్, క్లాంప్-షెల్ హుడ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, LED హెడ్‌లైట్లు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Maruti-Suzuki-Swift-2024

కాగా జపాన్‌లో లాంచ్‌ అయిన న్యూ జెన్‌ స్విఫ్ట్(New Gen Maruti Suzuki Swift) మూడు వేరియంట్లలో అంటే.. స్విఫ్ట్ XG, హైబ్రిడ్ MX మరియు హైబ్రిడ్ MZ వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. న్యూ జెన్‌ స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ 3-సిలిండర్ ఇంజిన్ & 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌లతో సంస్థ లాంచ్‌ చేసింది.

ఈ ఇంజిన్లు గరిష్ఠంగా 80 బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జత చేయబడి ఉంటాయి. జపాన్-స్పెక్ స్విఫ్ట్ ఆఫ్-రోడ్ ఔత్సాహికుల కోసం 4WD వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది.

Maruti-Suzuki-Swift-2024

జపాన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ కారు మైలేజ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ భారత మార్కెట్లోకి విడుదల చేయనున్న కొత్త తరం స్విఫ్ట్ 35-40 kmpl మైలేజీని అందించగలదని సమాచారం. దీంతో కొత్త తరం స్విఫ్ట్ కారు కోసం భారతీయ కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా భారత మార్కెట్లో ఎన్ని అధునాతన కార్లు లాంచ్‌ అవుతున్నప్పటికీ.. మారుతి స్విఫ్ట్ గత కొన్నేళ్లుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ పాపులర్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు తొలిసారిగా 2005లో దేశంలో విడుదలైంది. చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్‌ స్థానం ప్రత్యేకం. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు.

Maruti-Suzuki-Swift-2024

గత మూడు దశాబ్దాలుగా మారుతీ సుజుకీ ప్రతి నెలా ప్యాసింజర్ కార్ల విక్రయాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. కాగా భారత మార్కెట్లో మారుతీ సుజుకీ విక్రయాల్లో మరింత వృద్ధిని సాధించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో త్వరలో భారత మార్కెట్లోనూ మారుతి సుజుకి కొత్త తరం కారును విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Maruti-Suzuki-Swift-2024

More from DriveSpark

Article Published On: Thursday, December 7, 2023, 9:20 [IST]
English summary
Maruti suzuki swift 2024 launched in japan engine design features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+