Maruti Suzuki Swift కొత్త మోడల్ ఆవిష్కరణ.. లీటర్‌కు 40 కి.మీ మైలేజీ?
భారత మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మార్కెట్‌లో మూడో జనరేషన్ స్విఫ్ట్ విక్రయానికి అందుబాటులో ఉంది. మారుతి సంస్థ నాలుగో తరం మోడల్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న మొబిలిటీ షోలో మారుతి సుజుకి స్విఫ్ట్‌ను (Maruti Suzuki swift 4th Gen) ఆవిష్కరించారు. ఈ కారు ప్రొడక్షన్‌కు సిద్ధమైన కాన్సెప్ట్ మోడల్‌గా విడుదల అయింది. త్వరలో కొత్త వాహనాలు ఉత్పత్తి స్థాయికి అప్‌గ్రేడ్ చేయబడతాయని తెలుస్తోంది. 2024లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ మోడల్ యూరప్, ఆసియాలో పరీక్షించబడుతోంది.

నాలుగో జనరేషన్ మారుతి స్విఫ్ట్ మరింత మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు మరింత శక్తివంతమైన పవర్‌ట్రైయిన్ కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజైన్ పరంగా వృత్తాకార గ్రిల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్, మరియు డేటైం రన్నింగ్ లైట్లను కలిగి ఉంది. కొత్త డిజైన్‌తో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్, బంపర్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త మోడల్ ఆకట్టుకుంటుంది.
40 కి.మీ మైలేజీ : కొత్త తరం స్విఫ్ట్ హ్యా్చ్‌బ్యాక్ ఇంజిన్ కోడ్ నేమ్ Z12గా ఉంది. 1.2 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే 4 సిలిండర్‌కు బదులుగా.. 3- సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ లీటర్‌కు 40 కి.మీ మైలేజీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలో మైలేజీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

క్యాబిన్ : మారుతి సుజుకి స్విఫ్ట్ 4వ జనరేషన్ కారు క్యాబిన్.. బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వాహనాల క్యాబిన్‌ల మాదిరిగా ఉంటుంది. స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు 4వ తరం స్విఫ్ట్‌లోనూ ఉంటాయి. ఈ కొత్త కారు డ్యాష్‌బోర్డు ప్రత్యేకంగా రూపొందింది.
దీంతోపాటు 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్/ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ కారు ఉత్పత్తి సమయంలో మరిన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

భద్రతా పరంగా స్విఫ్ట్ 4వ తరం కారులో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్‌లను ఆశించవచ్చు. ADAS- అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ 4వ తరం కారు గరిష్ఠంగా 5-6 నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అంటే 2024 మధ్యనాటికి విక్రయాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మారుతి సుజుకి సంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. డిజైన్, పవర్‌ట్రైన్ సహా ఇతర అంశాల్లో ప్రస్తుత మోడల్ కంటే ఆకట్టుకుంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








