మరోసారి భారత్ రోడ్లపై మారుతి స్విఫ్ట్ కొత్త మోడల్ కారు టెస్టింగ్.. లాంచ్ ఎప్పుడంటే?
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి ( Maruti Suzuki) ప్రముఖ సంస్థగా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ నుంచి త్వరలో 4వ జెనరేషన్ స్విఫ్ట్ కారును విడుదల చేయనుంది. ఈ కారును జపాన్ మొబిలిటీ షోలో ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కారుపై భారీ అంచనాలున్నాయి. 2024 మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ కారును భారత్ రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మారుతి సుజుకి స్విఫ్ట్ ( Maruti Suzuki Swift) వెనుక ప్రొఫైల్‌ను చూడవచ్చు. భారత్ సహా ప్రపంచవ్యప్తంగా ఒకే మోడల్ కారు విడుదల అవుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఈ కారు వెనుక బంపర్, టెయిల్ ల్యాంప్ వినూత్న డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

జపాన్ మొబిలిటీ షోలో నాలుగో తరం స్విఫ్ట్ ఆవిష్కరించిన కొన్నిరోజులకే తొలిసారి భారత్ రోడ్లపై కనిపించింది. ఇప్పుడు మరోసారి ఈ కారును టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు అమర్చిన కొత్త ఇంజిన్ కారణంగా.. లీటర్‌కు 40 కి.మీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. అయితే మైలేజీపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
జపాన్ మొబిలిటీ షోలో ప్రొడక్షన్‌కు సిద్ధమైన కాన్సెప్ట్ మోడల్ కారునే సంస్థ ఆవిష్కరించింది. త్వరలో కొత్తతరం స్విఫ్ట్ వాహనాలను ఉత్పత్తి స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఉత్పత్తి 2024లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే యూరప్, ఆసియాలో పరీక్షించగా.. తాజాగా భారత్‌లోనూ టెస్టింగ్ చేస్తున్నారు. ఇన్‌స్టా వేదికగా ఈ వీడియో వైరల్ అవుతోంది.
నాలుగో జనరేషన్ మారుతి స్విఫ్ట్ మరింత మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. గతం కంటే శక్తివంతమైన పవర్‌ట్రైయిన్ కూడా కలిగి ఉందని తెలుస్తోంది. డిజైన్ పరంగా వృత్తాకార గ్రిల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్, మరియు డే టైం రన్నింగ్ లైట్లు సహా కొత్త డిజైన్‌తో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్, బంపర్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త మోడల్ భారీగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.
కొత్త తరం స్విఫ్ట్ హ్యా్చ్‌బ్యాక్ ఇంజిన్ కోడ్ నేమ్ Z12గా ఉంది. 1.2 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే 4 సిలిండర్‌కు బదులుగా.. 3- సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ లీటర్‌కు 40 కి.మీ మైలేజీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలో మైలేజీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
క్యాబిన్ మారుతి సుజుకి స్విఫ్ట్ 4వ జనరేషన్ కారు క్యాబిన్.. బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వాహనాల క్యాబిన్‌ల మాదిరిగా ఉంటుంది. స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు 4వ తరం స్విఫ్ట్‌లోనూ ఉంటాయి. ఈ కొత్త కారు డ్యాష్‌బోర్డు ప్రత్యేకంగా రూపొందింది.
దీంతోపాటు 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ కారు ఉత్పత్తి సమయంలో మరిన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
భద్రతా పరంగా మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్‌లను ఆశించవచ్చు. ADAS- అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 4వ తరం కారు గరిష్ఠంగా 5-6 నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








