భారత్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్ నాలుగో జనరేషన్‌ కారు టెస్టింగ్‌. లీటర్‌కు 40 కి.మీ మైలేజీ?

మారుతి సుజుకి స్విఫ్ట్‌ నాలుగో జనరేషన్‌ కారును (Maruti Suzuki swift fourth generation car) ఇటీవల జరిగిన జపాన్‌ మొబిలిటీ షోలో సంస్థ ఆవిష్కరించింది. భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం మూడో జనరేషన్‌ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంది. త్వరలో నాలుగో తరం స్విఫ్ట్ ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

జపాన్ మొబిలిటీ షోలో నాలుగో తరం స్విఫ్ట్‌ ఆవిష్కరించిన కొన్నిరోజులకే ఈ కారు భారత్‌ రోడ్లపై కనిపించింది. ప్రస్తుతం ఈ వాహనాన్ని భారత్‌లో తొలిసారిగా టెస్టింగ్‌ చేస్తున్నారు. ఈ కారుకు అమర్చిన కొత్త ఇంజిన్‌ కారణంగా.. లీటర్‌కు 40 కి.మీ మైలేజ్‌ ఇస్తుందని తెలుస్తోంది. అయితే మైలేజీపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

swift 4th generation car spotted testing in india

జపాన్‌ మొబిలిటీ షోలో ప్రొడక్షన్‌కు సిద్ధమైన కాన్సెప్ట్ మోడల్‌ కారునే సంస్థ ఆవిష్కరించింది. త్వరలో కొత్తతరం స్విఫ్ట్‌ వాహనాలను ఉత్పత్తి స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఉత్పత్తి 2024లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మోడల్‌ ఇప్పటికే యూరప్‌, ఆసియాలో పరీక్షించగా.. తాజాగా భారత్‌లోనూ టెస్టింగ్‌ చేశారు.

నాలుగో జనరేషన్‌ మారుతి స్విఫ్ట్‌ మరింత మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. గతం కంటే శక్తివంతమైన పవర్‌ట్రైయిన్‌ కూడా కలిగి ఉందని తెలుస్తోంది. డిజైన్ పరంగా వృత్తాకార గ్రిల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్టైలిష్‌ LED హెడ్‌ల్యాంప్‌, మరియు డే టైం రన్నింగ్‌ లైట్లు సహా కొత్త డిజైన్‌తో అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. టెయిల్‌గేట్‌, బంపర్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త మోడల్‌ భారీగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.

swift 4th generation model spotted testing in india

కొత్త తరం స్విఫ్ట్‌ హ్యా్చ్‌బ్యాక్‌ ఇంజిన్‌ కోడ్‌ నేమ్‌ Z12గా ఉంది. 1.2 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే 4 సిలిండర్‌కు బదులుగా.. 3- సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ లీటర్‌కు 40 కి.మీ మైలేజీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలో మైలేజీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

క్యాబిన్‌: మారుతి సుజుకి స్విఫ్ట్‌ 4వ జనరేషన్‌ కారు క్యాబిన్.. బాలెనో, ఫ్రాంక్స్‌, గ్రాండ్‌ విటారా వాహనాల క్యాబిన్‌ల మాదిరిగా ఉంటుంది. స్టీరింగ్‌ వీల్‌, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు 4వ తరం స్విఫ్ట్‌లోనూ ఉంటాయి. ఈ కొత్త కారు డ్యాష్‌బోర్డు ప్రత్యేకంగా రూపొందింది.

Maruti Suzuki swift fourth generation car

దీంతోపాటు మారుతి సుజుకి స్విఫ్ట్‌ 4వ జనరేషన్‌ కారు 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఉన్నాయి. ఈ కారు ఉత్పత్తి సమయంలో మరిన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

భద్రతా పరంగా : మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌లను ఆశించవచ్చు. ADAS- అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్‌ 4వ తరం కారు గరిష్ఠంగా 5-6 నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Maruti Suzuki swift new car

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, November 6, 2023, 11:56 [IST]
English summary
Maruti suzuki swift new generation car spotted testing in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+