మారుతి నుంచి eWX ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ.. పూర్తి ఛార్జ్‌పై 230 కి.మీ రేంజ్‌.!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కొత్త eWX కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఇది మినీ వ్యాగన్‌ EV అని మారుతి ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ధరలో ఉండే మారుతి సుజుకి కార్లు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. కాగా ఈ నేపథ్యంలో మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్‌ కారు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టోక్యోలో జరిగిన జపాన్‌ మొబిలిటీ షో 2023లో మారుతి కొత్త eWX కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

Maruti-Suzuki-eWX

కొత్త మారుతి సుజుకి eWX మినీ వ్యాగన్‌ EV అని సంస్థ తెలిపింది.ఈ కాన్సెప్ట్‌ మోడల్‌ సాధారణ ప్రజలు అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొలతలు, డ్రైవింగ్‌ విశేషాలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. eWX తో పాటు మారుతి సుజుకి న్యూ జెన్‌ స్విఫ్ట్‌ కాన్సెప్ట్‌, eVX అప్‌డేట్‌ వెర్షన్‌ ఇంకా స్పేసియా కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.

ఇక సుజుకి eWX డ్రైవింగ్‌ స్పెసిఫేకేషన్లను పరిశీలిస్తే ఇది పూర్తి ఛార్జ్‌పై 230 కి.మీ ల రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది. దీని ద్వారా ఇందులో ముందు లేదా వెనుక చక్రాలకు శక్తిని సరఫరా చేసేందుకు సింగిల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కాగా దీని పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, పొడవు 1,620mm ఉంటుంది.

Maruti-Suzuki-eWX

మారుతి సుజుకి కాన్సెప్ట్‌ మోడల్‌ eWX మినీ వ్యాగన్‌ ఫ్యూచరిస్టిక్‌ EV కి చెందిన క్రాస్‌ ఓవర్‌. eWX డిజైన్‌, ఎక్స్‌టీరీయర్‌, ఇంటీరియర్‌ను పరిశీలించినట్లయితే కస్టమర్లు ఈ కారు లోపల విశాలమైన క్యాబిన్.. తమ ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించేలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న S ప్రెస్సో సైజ్‌ 3.4 మీటర్లు. అయితే మారుతి సుజుకి ఆవిష్కరించిన eWX S Presso కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. అయితే జపాన్‌లో కీ కార్‌ కొనుగోలుదారులను ఈ సరికొత్త కారు ఆవిష్కరణతో లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Maruti-Suzuki-eWX

మారుతి ఆవిష్కరించిన eWX EV ముదురు మరియు లేత బూడిద రంగులో డ్యూయల్‌ టోన్‌ కలర్‌ స్కీమ్‌లో పూర్తి చేసినట్లుగా కనిపిస్తోంది. డిజైన్‌, ఇంటీరియర్‌ను పరిశీలిస్తే ఫ్రంట్‌ బంపర్‌, అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. విండో ఫ్రేమ్‌లపై నియాన్‌ గ్రీన్‌ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఫ్రంట్‌ భాగంలో C ఆకారంలో LED డే టైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ ఇంకా సుజుకి లోగో మెరుస్తూ కనిపిస్తుంది.

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల డిమాండ్‌లకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సంస్థలు చాలా వరకు తమ మోడల్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చి మంచి సేల్స్ దక్కించుకుంటున్నాయి.

Maruti-Suzuki-eWX

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 25, 2023, 18:08 [IST]
English summary
Maruti suzuki unveiled ewx ev with 230 km range in japan auto show 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+