ప్రముఖ బ్రాండ్‌ కారులో ముఖ్యమైన ఫీచర్‌ తొలగింపు.. అదేంటంటే.!!

మారుతి వ్యాగన్‌ ఆర్‌(Wagon R) దేశంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ బడ్జెట్ కార్లలో ఒకటి. కానీ కంపెనీ ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన టాప్ వేరియంట్ నుంచి ఒక ఫీచర్‌ను తొలగించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు అదేంటో ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం.

ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ హ్యాచ్‌బ్యాక్ LXi, VXi, ZXi మరియు ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో పాటు, ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Maruti-Wagon-R

బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో ఈ కంపెనీకి చెందిన కార్లలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా వ్యాగన్‌ ఆర్‌ ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, మారుతి వ్యాగన్ R పెట్రోల్ మరియు CNG ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ఆప్షన్ లాగే సీఎన్ జీ ఆప్షన్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

మారుతి సుజుకి ఇప్పుడు ఈ మోడల్ కోసం కారు వెనుకవైపు అందించిన డీఫాగర్ వైపర్‌ని తొలగించింది. ఈ ఫీచర్ కేవలం టాప్ స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందించబడుతోంది. అంటే ఈ ఫీచర్ టాప్-స్పెక్ ZXi ప్లస్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లలో మాత్రమే ప్రవేశపెట్టింది.

Maruti-Wagon-R

ఈ ఫీచర్‌ని తొలగించడం మినహా, వ్యాగన్ R ఫీచర్ జాబితాలో మరే ఇతర మార్పులు చేయలేదు. వ్యాగన్ R 1.2 లీటర్ మరియు 1.0 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. మొదటిది 89 bhp వద్ద 113 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదేవిధంగా రెండవది 66 bhp వద్ద 89 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT (AGS) గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంకా, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా కంపెనీ అమర్చిన CNG కిట్ ఎంపికతో వస్తుందని వినియోగదారులు గమనించాలి.

Maruti-Wagon-R

కాగా కంపెనీ వ్యాగన్‌ ఆర్‌ను 1999 నుంచి విక్రయిస్తోంది. అప్పటి నుంచి, వ్యాగన్ ఆర్ భారతీయ మార్కెట్‌లో విక్రయాల్లో దూసుకుపోతుంది. వ్యాగన్ ఆర్ చాలా మంది భారతీయులకు ఫేవరెట్‌ వాహనం అని, ఈ కారును కొనుగోలు చేసిన వారు మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేందుకు వస్తుంటారని కంపెనీ పేర్కొంది. తాజాగా 30 లక్షల యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 23:27 [IST]
English summary
Maruti wagon r important feature rear defogger function removed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+