AMG E 53 క్యాబ్రియోలెట్: 2023 లో మెర్సిడెస్ బెంజ్ ఫస్ట్ కార్.. ధర రూ. 1.30 కోట్లు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో ఈ కొత్త సంవత్సరం మొదటి ఉత్పత్తిని విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన 2023 సంవత్సరపు మొదటి కార్ "మెర్సిడెస్ ఏఎమ్‌జి ఈ 59 కాబ్రియోలెట్". దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన ఈ కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఈ 59 కాబ్రియోలెట్ (Mercedes AMG E 53 4Matic+ Cabriolet) ప్రారంభ ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ ధర ఇప్పటికే విక్రయించబడుతున్న ఈ 53 సెడాన్ కంటే కూడా దాదాపు రూ. 24 లక్షలు ఎక్కువ. ఇప్పటికే మార్కెట్లో E 53 సెడాన్, GLE 53 కూపే-SUV మరియు EQS 53 సెడాన్ ఉన్నాయి.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

AMG E 53 4Matic+ Cabriolet అనేది ఇప్పుడు భారతీయ మార్కెట్లో నాలుగవ 53 బ్యాడ్జెడ్ మోడల్ అవుతుంది. E 53 క్యాబ్రియోలెట్ రెండు డోర్స్ కలిగి నాలుగు సీట్లు కలిగిన కన్వర్టిబుల్ వెర్షన్. కావున నలుగురు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. మెర్సిడెస్ బెంజ్ ఇలాంటి ఓపెన్ టాప్ వెర్షన్‌లను భారతదేశానికి తీసుకురావడం ఇదే మొదటి సారి కాదు. కంపెనీ ఇలాంటి మోడల్ 2010 లోనే ప్రారంభించింది.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు విడుదల చేసిన మోడల్ గతంలో కంటే కూడా చాలా శక్తివంతమైనది మరియు అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ E 53 క్యాబ్రియోలెట్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది చూడటానికి ముందు వైపు నుంచి సెడాన్ ని పోలి ఉంటుంది, కాగా మిగిలిన మోడల్స్ AMG మోడల్‌ మాదిరిగా సిగ్నేచర్ AMG 'పనామెరికానా గ్రిల్' మరియు స్పోర్టీ ఫ్రంట్ బంపర్‌ పొందుతుంది.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

అంతే కాకుండా, AMG E 53 4Matic+ Cabriolet యొక్క డోర్ పైభాగంలో క్రోమ్ స్ట్రిప్ కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటాయి. అల్లాయ్ వీల్స్ ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. రియర్ ప్రొఫైల్ సొగసైన హారిజాంటల్ టెయిల్ ల్యాంప్‌ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది. మొత్తం మీద దీని డిజైన్ చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

E 53 క్యాబ్రియోలెట్ ఇంటీరియర్ కూడా E 53 సెడాన్‌ను పోలి ఉంటుంది. అయితే ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం ట్విన్-స్క్రీన్ సెటప్ హైలైట్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారు గురించి డ్రైవర్‌కు సమాచారం అందిస్తుంది. ఇందులోని స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి మంచి గ్రిప్ అందిస్తుంది. కావున డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ కి మంచి పట్టుని అందిస్తుంది.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

ఇక చివరగా అత్యంత శక్తివంతమైన మరియు చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం ఇంజిన్. మెర్సిడెస్-AMG E 53 క్యాబ్రియోలెట్ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 435 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఇది 21 హెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌తో జత చేయబడింది. కావున ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది.

2023 లో మొదటి కార్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్: ధర రూ. 1.30 కోట్లు

మెర్సిడెస్-AMG E 53 క్యాబ్రియోలెట్ యొక్క 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేయబడుతుంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 వరకు వేగవంతం అవుతుంది. ఈ లేటెస్ట్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2023 వ సంవత్సరం మెర్సిడెస్ బెంజ్ కంపెనీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తి ఈ AMG E 53 క్యాబ్రియోలెట్. ఇది తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mercedes amg e 53 cabriolet launched in india price features and details
Story first published: Friday, January 6, 2023, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X