భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ AMG SL55 కారు.. దశాబ్దం తర్వాత రీఎంట్రీ..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త వాహనం Mercedes AMG SL55 రోడ్‌స్టర్ కారును భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ తన 5వ జనరేషన్ కారును సుమారు దశాబ్దం కిందట విడుదల చేసింది. మళ్లీ ఇప్పుడు తన 7వ జనరేషన్ కారు SLను భారత్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్ AMG SL55 మాడ్యూలర్ స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్ (MSA) ఫ్లాట్‌ఫారంపై ఆధారపడి ఉంటుంది.
కొత్త మెర్సిడెస్ AMG SL55 కారు పొడవు 4,705 మి.మీ, వెడల్పు 1915 మి.మీ, మరియు ఎత్తు 1359 మి.మీ. 2700 మి.మీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. మెర్సిడెస్ ఇండియా 2+2 సీటర్ SL లగ్జరీ కన్వర్టబుల్ వెర్షన్ మాత్రమే భారత్‌లోకి తీసుకువచ్చింది.

ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 M177 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 5500 - 6500 rpm వద్ద 469 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు 2250- 4500 rpm వద్ద 700 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఆల్‌వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు శక్తి వెళ్తుంది.

మెర్సిడెస్ AMG SL55 రోడ్‌స్టర్ కారు కేవలం 3.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మరియు గరిష్ఠంగా 295 km/h వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ కారు 275/35 (ముందు) 305/30 (వెనుక) టైర్లతో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఫ్యాబ్రిక్ రూఫ్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. నలుపు, ఎరుపు, గ్రే రంగుల్లో లభిస్తుంది.
మెర్సిడెస్ AMG SL55 కారు డిజైన్ విషయానికి వస్తే నిలువు స్లాట్లతో కన్వర్టబుల్ స్పోర్టింగ్ మెర్క్ యొక్క పనామెరికా స్ట్రైల్ గ్రిల్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. త్రిభుజాకార హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ఇది కారు మరింత మెరుగైన రూపాన్ని అందిస్తుంది. మెర్సిడెస్ కారు వెనుక భాగంలో టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. మరియు క్లాడ్ ఎగ్జాస్ట్ పైపులను కలిగి ఉంది.

ఈ కారు కారు 240 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్‌ను కలిగి ఉంటుంది. MBUX సాఫ్ట్‌వేర్‌తో SL డ్యూయల్ డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. 11.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ యూనిట్ ఉంటుంది. మెర్సిడెస్ AMG SL55 రోడ్‌స్టర్ ADAS టెక్నాలజీతో వస్తుంది. ఫలితంగా యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారు ధర రూ.2,35 కోట్లు (ఎక్స్‌షోరూం).

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








