మెర్సిడెస్ బెంజ్ AMG C43 కారు విడుదల.. టర్బో టెక్ సహా కీలక ఫీచర్లు!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో కొత్త కారు Mercedes Benz AMG C43 4Matic సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారు టర్బో టెక్నాలజీ ఇంజిన్ సహా కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ బెంజ్ లగ్జరీ సెడాన్ 2.0 లీటర్ టర్బో ఛార్జడ్ 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. సి- క్లాస్‌లో ఎలక్ట్రిక్ ఎగ్జాస్ట్ గ్యాస్ టర్బోఛార్జర్‌ను కలిగిన ప్రపంచంలోని తొలి ప్రొడక్షన్ ఇంజిన్ అని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.
డైనమిక్ డ్రైవింగ్: ఈ ఇంజిన్ మునిపటి కంటే డైనమిక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ ఎగ్జా్స్ట్ టర్బోఛార్జర్ టెక్నాలజీ ఫార్ములా F1 నుంచి నేరుగా తీసుకోబడింది. 48v ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఎగ్జా్స్ట్ టర్బోఛార్జర్ 175000 rpm వేగంతో పనిచేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ AMG C43 4Matic ఈ ఇంజిన్ 6750 rpm వద్ద 402bhp శక్తి, 5500 rpm వద్ద 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఆల్‌వీల్ డ్రైవ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పంపబడుతుంది. ఇంజిన్ బెల్ట్ ద్వారా నడిచే స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ ద్వారా అవసరమైనప్పుడు మరో 13.4 bhp శక్తిని అదనంగా అందిస్తుంది.
4.6 సెకన్లలో 100 కి.మీ వేగం : ఈ మెర్సిడెస్ C43 కారు కేవలం 4.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మరియు గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ గ్రిల్ మరియు అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది. దీంతోపాటు అగ్రెసిప్ బంపర్‌లు, స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్ మరియు క్యాడ్ ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌లు ఉన్నాయి.

AMG C43 ఫీచర్లు: మెర్సిడెస్ బెంజ్ AMG C43 కీలక ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, 11.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AMG స్పోర్ట్ సీట్లు, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, క్యాబిన్ చుట్టూ స్పోర్ట్స్ పెడల్స్ ఉన్నాయి. నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది.
C34 AMG 4 మ్యాటిక్.. కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్స్ + మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఎయిర్ రైడ్ సస్పెన్షన్ సిస్టమ్‌ను సర్దుబాటు చేస్తాయి. ఈ మోడల్ గరిష్ఠంగా 2.5 డిగ్రీల స్టీరింగ్ యాంగిల్‌తో పనిచేసే రియర్ వీల్ స్టీరింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ధర రూ.98 లక్షలు (ఎక్స్‌షోరూం)గా విడుదల అయింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








