Mercedes Benz EQE 500 ఎలక్ట్రిక్‌ కారు విడుదల.. 521 కి.మీ రేంజ్‌..!

భారత్‌ మార్కెట్‌లో Mercedes Benz కొత్త EQE 500 SUVను విడుదల చేసింది. భారత్‌లో EQE 500 SUV బెంజ్‌ సంస్థ మూడో ఎలక్ట్రిక్‌ వాహనం. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.1.39 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇప్పటికే EQB SUV, EQSలను బెంజ్‌ విడుదల చేసింది.

మెర్సిడెస్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. బెంజ్‌ EQE 500 4 మ్యాటిక్ ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు. ఈ వేరియంట్‌ ఆడీ Q8 e-Tron, BMW iX వంటి ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలతో పోటీపడనుంది.

Mercedes Benz EQE 500 Electric SUV launched

బెంజ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ SUV EQ సెగ్మెంట్‌ సిగ్నేచర్‌ స్వూపింగ్‌ ఎక్స్‌టీరియర్‌ సహా ఆకర్షణీయమైన ఏరోడైనమిక్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ఏరో అప్టిమైజ్డ్‌ 20 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంటాయి. ఈ కొత్త కారు 9 రంగుల్లో లభించనుంది. మరియు కస్టమర్లు రెండు ఇంటీరియర్‌ కలర్‌ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.

దీంతోపాటు మెర్సిడెస్‌ బెంజ్‌ EQE 500 ఎలక్ట్రిక్‌ SUV 25 అంగుళాల హెడ్‌అప్‌ డిస్‌ప్లే, మసాజ్‌ సీట్లు, 15 స్పీకర్లతో బర్మెస్టర్‌ స్పీకర్లు, 4 జోన్‌ క్లైమెట్ కంట్రోల్, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, యాక్టివ్‌ యాంబియంట్‌ టాప్‌ షెల్ప్‌, HEPA ఫిల్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mercedes Benz EQE 500 Electric SUV launched

భద్రతా పరంగా కీలక ఫీచర్లను ఈ బెంజ్‌ EQE 500 ఎలక్ట్రిక్‌ కారు కలిగి ఉంది. 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ESC, EBDతో కూడిన ABS, 360 డిగ్రీల కెమెరా, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, పార్కింగ్‌ అసిస్ట్‌, డిజిటల్‌ LED హెడ్‌లైట్లు వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ కారు వేర్వేరు యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్‌ మోటార్‌లను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్‌ మోటార్లు 408bhp శక్తి, 858Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV 90.6kWh లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 521 కి.మీ రేంజ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ బ్యాటరీ ప్యాక్‌పై 10 సంవత్సరాల వారంటీని ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

Mercedes Benz EQE 500 Electric SUV launched

అంతర్జాతీయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ EQE ఎలక్ట్రిక్‌ SUV వేర్వేరు పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. EQE 350+, EQE 350 4 Matic, EQE 500 4Maticలు ఉన్నాయి. EQE 43 4Matic, EQE 53 4Matic+ వంటి AMG వంటి వేరియంట్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 15, 2023, 17:57 [IST]
English summary
Mercedes benz eqe 500 electric suv launched in india at rs1 39 core starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+