లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ GLE LWB కారు లాంచ్.. ధర రూ. 96 లక్షలు
ప్రపంచంలోనే ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా మెర్సిడెస్-బెంజ్ (Mercedes Benz) ప్రజాదరణ పొందింది. భారత్‌లో సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇంకా ప్రముఖ వ్యాపారవేత్తల కార్ల కలెక్షన్‌లో మెర్సిడెంజ్ బెంజ్ కారు మోడళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మనం చూశాం. తాజాగా Mercedes-Benz GLE LWB దేశీయ మార్కెట్లోకి విడుదలైంది.
మెర్సిడెస్ బెంజ్ GLE LWB SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కస్టమర్లకు మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ. 96.40 లక్షలు (ఎక్స్-షోరూమ్ భారత్)గా సంస్థ నిర్ణయించింది. ఈ కారుతో పాటు Mercedes-Benz AMG C43 వెర్షన్ కూడా విడుదలైంది. ఈ ఏడాది మెర్సిడెస్ విడుదల చేసిన చివరి కార్లు ఇవే కావడం విశేషం.

కొత్త Mercedes-Benz GLE LWB SUV బుకింగ్‌లను ఈరోజు నుంచే సంస్థ ప్రారంభించింది. ఈ నెల(నవంబర్) చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇక ఈ లగ్జరీ కారు డిజైన్‌ను పరిశీలిస్తే.. ఈ కారును మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. ముందు భాగంలో లాంగ్ వీల్ బేస్‌తో పాటు ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌లు, సింగిల్ స్లాట్ గ్రిల్‌తో పాటు రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.
ఇంకా ఆకర్షణీయమైన LED టెయిల్ లైట్లు, కొత్త రియర్ బంపర్ ఉన్నాయి. కొత్త మెర్సిడెస్ బెంజ్ GLE లో ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సరికొత్త స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, రీడిజైన్ చేసిన ఎయిర్-కాన్ వెంట్స్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ యాంగిల్ కెమెరా, ట్రాన్స్‌పరెంట్ బానెట్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ సన్ బ్లైండ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Mercedes-Benz GLE LW SUV పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇందులో మూడు పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లు ఉన్నాయి. అవి, 2.0 - లీటర్ డీజిల్, 3.0 - లీటర్ డీజిల్ మరియు 3.0 - లీటర్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లు. ఇందులో 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా 265 bhp శక్తిని, 550 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది.
అయితే, 6-సిలిండర్ ఇంజన్ 362 బిహెచ్‌పి పవర్, 750 ఎన్ఎమ్ పీక్ టార్క్, 375 బిహెచ్‌పి పీక్ పవర్ మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని విడుదల చేయగలదు. ఈ అన్ని ఇంజన్లు 8-స్వీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉన్నాయి. ఈ కారు AWD (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీని పొందుతుంది.

ఇక దీంతో పాటు విడుదలైన Mercedes-Benz AMG C43 విషయానికొస్తే ఈ కారు రూ.98 లక్షల ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఆకర్షణీయమైన లుక్, డిజైన్‌తో దీనిని లాంచ్ చేసింది.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. గరిష్ఠంగా 402 bhp శక్తిని మరియు 500 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్వీడిష్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒకేసారి రెండు లగ్జరీ కార్లను విడుదల చేసిన మెర్సిడెస్ కస్టమర్లను ఆకట్టకునేందుకు సిద్ధంగా ఉంది.



Click it and Unblock the Notifications








