Mercedes EQE SUV Full Review Video మెర్సిడెస్ EQE SUV.. 550 కి.మీ రేంజ్, ADAS ఫీచర్ సహా..
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ ఇటీవల భారత్ మార్కెట్‌లోకి EQE SUVను విడుదల చేసింది. ఇక్కడ మెర్సిడెస్ సంస్థకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో EQE విక్రయాలు రాణించే అవకాశం ఉంది. కొత్త ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మెర్సిడెస్ సంస్థ మా బృందాన్ని ఆహ్వానించింది.
కశ్మీర్‌లోని అందమైన పర్వత శ్రేణుల్లో మెర్సిడెస్ EQE ఎలక్ట్రిక్ SUV పనితీరును పరీక్షించాము. అందుకు సంబంధించిన పూర్తి రివ్యూను వీడియోతోపాటు మీకు అందించాము. రివ్యూను పూర్తిగా చూసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.
ఈ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే 90.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ 402bhp, 858Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.6 సెకన్లలోనే 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు గరిష్ఠంగా 210km/h వేగంతో ప్రయాణం చేయగలదు.

మెర్సిడెస్ EQE SUV భారీ బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 550 కి.మీ రేంజ్ ఇస్తుంది. 11kW AC ఛార్జర్‌తో 9.5 గంటల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. ఈ కారు 170kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో అధిక రేంజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా ఉంది.


Click it and Unblock the Notifications








