MG కామెట్‌ ఈవీపై రూ. 65,000 భారీ తగ్గింపు.. తక్కువ ధరలో ఈ చిన్న కారును సొంతం చేసుకోండి, కొద్ది రోజులే ఛాన్స్‌!

దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెడుతుండటంతో క్రమంగా ఇ కార్ల విక్రయం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఎలక్ట్రిక్‌ కారు ఎంజీ కామెట్‌.. రూ. 8 లక్షల ధరలోపే ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే.. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో లభిస్తున్న కారు MG Comet. దీంతో ఈ కారుకు డిమాండ్‌ పెరగడంతో వేగంగా సేల్స్‌ను నమోదు చేసుకుంటోంది. కాగా 2023 ఏడాది ముగుస్తుండటంతో కామెట్‌ ఈవీ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

MG-Comet-EV

ఈ ఏడాది డిసెంబర్‌లో కామెట్ EV కొనుగోలుపై మోరిస్‌ గ్యారేజ్‌ రూ. 65,000 తగ్గింపును ప్రకటించింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ కారుతో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలనుకుంటే.. మీరు కామెట్ EVని కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తంలో మీకు డబ్బు ఆదా అవుతుంది. వేరియంట్లను బట్టి కామెట్ EV ధర రూ. 7.98 లక్షల నుంచి రూ. 10.63 లక్షలుగా ఉంది.

ఎంజీ కామెట్ EV 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీల డ్రైవ్ రేంజ్‌ను ఇస్తుంది. కాగా ఇందులో రియర్-యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది గరిష్ఠంగా 42 బీహెచ్‌పీ పవర్ మరియు 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది.

MG-Comet-EV

ఇక MG Comet ఈవీలో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్, మాన్యువల్ AC, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, నావిగేషన్ కోసం కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ గైడెన్స్‌తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

ఎంజీ కామెట్‌ ఎలక్ట్రిక్ కారు సిస్టమ్ 3.3kW AC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. కాగా 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 5 గంటలు సరిపోతుంది. కాగా దీని నిర్వహణ ఖర్చు నెలకు రూ.500 మాత్రమే ఉంటుందని కంపెనీ పేర్కొంది.

MG-Comet-EV

కాగా MG నుండి ఈ ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా సిటీ రోడ్ల కోసం నిర్మించారు. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. ఇందులో నాలుగు సీట్లు ఉన్నాయి. కారు పొడవు 3 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఎంజీ కామెట్‌ ఈవీని 4 ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ ప్రవేశపెట్టింది. ఇది భారత మార్కెట్లో టాటా టియాగో ఈవీకి గట్టి పోటీనిస్తోంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎంజీ కామెట్‌ సేల్స్‌ గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. జూన్‌లో 1,184 యూనిట్లు అమ్ముడవగా.. జూలైలో 1,117 యూనిట్లను సంస్థ విక్రయించింది. ఆగస్టులో 651 యూనిట్లు, సెప్టెంబర్‌లో 1,020 యూనిట్లు సేల్‌ అయ్యాయి. కాగా అక్టోబర్‌లో 1,036 యూనిట్లు, నవంబర్‌లో 698 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2023, 9:38 [IST]
English summary
Mg comet electric car at most affordable price in december know features and range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+