MG Comet EV ఈ కారుని వాడిన మూడేళ్ల తర్వాత 60 శాతం డబ్బు వాపస్..
ప్రముఖ కారు బ్రాండ్ ఎంజీ మోటర్ విడుదల చేసిన ఎంజీ కామెట్ బుకింగ్స్ (15-05-2023) నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి పట్టణ ప్రాంత మొబిలిటీ కోసం దీనిని ప్రత్యేకంగ తీసుకువచ్చింది. ఈ సరికొత్త చిన్నకారులు కొనుగోలు చేయాలనుకునేవారు సంస్థ వెబ్ సైట్‌ను సందర్శించి కారును బుక్ చేసుకోవచ్చు.
ప్రముఖ కారు బ్రాండ్ ఎంజీ మోటర్ ఇండియా నుంచి పట్టణ ప్రాంత మొబిలిటీ కోసం విడుదలైన స్మార్ట్ ఎంజీ కామెట్ బుకింగ్స్ (15-05-2023) నుంచి అధికారికంగా స్వీకరిస్తుంది. ఈ సరికొత్త చిన్నకార్లను కొనుగోలు చేయాలనుకునేవారు సంస్థ వెబ్ సైట్‌ను సందర్శించి కారును బుక్ చేసుకోవచ్చు.

ఎంజీ మోటర్ ఇండియా వెబ్‌సైట్ https://www.mgmotor.co.in/ పైన ఆన్‌లైన్ ద్వారా కానీ లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద రూ.11,000/- లు మాత్రమే చెల్లించి కామెట్ కారు బుక్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా, డెలివరీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చూసుకోవడానికి గాను ఎంజీ, 'MyMG' యాప్‌ను తీసుకువచ్చింది. ఆటో పరిశ్రమలోనే ప్రప్రథమంగా దీనినితీసుకురావడం విశేషం.
ఈ యాప్ ద్వారా 'ట్రాక్ అండ్ ట్రేస్' ఫీచర్ (బుకింగ్ నుంచి డెలివరీ వరకు సంపూర్ణ ఎక్స్పీరియన్స్)ని ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ కస్టమర్లకు తమ ఫోన్ల నుండే తమ కారు బుకింగుల స్థితిని తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఎంజీ కామెట్ ఇవి బుకింగుల ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ గౌరవ్ గుప్తా, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ఎంజీ మోటర్ ఇండియా హర్షం వ్యక్తం చేశారు.

"భారతీయ పట్టణప్రాంత వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చే ఉద్దేశ్యముతో ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వే అభివృద్ధిపరచబడింది. ఎంజీ పరిశ్రమలో మొదటిదైన 'ట్రాక్ అండ్ ట్రేస్' ఫీచర్‌తో, తమ కార్ బుకింగ్ యొక్క స్థితిని తెలుసుకోవడానికి మా కస్టమర్ల యొక్క ఎప్పటికీ ముగిసిపోని ఇబ్బందులకు ముగింపు పలకాలని మేము లక్ష్యంగా చేసుకున్నా"మని అన్నారు. కస్టమర్లు అతి త్వరలోనే తమ స్వంత ఎంజీ కామెట్‌ని అనుభూతి చెందగలుగుతారని చెప్పారు.
ఈ కామెట్ ఎలక్ట్రిక్ కార్ పేస్ వేరియంట్ ప్రారంభ ధర, రూ.7.98 లక్షలతో అందుబాటులో ఉంది. ప్లే మరియు ప్లష్ వేరియంట్లు వరుసగా రూ.9.28, రూ. 9.98 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉన్నాయి. ఈ సంస్థ అందించే మొదటి 5,000 బుకింగ్స్ కు పరిమిత ఆఫర్లు ఉన్నాయి. కంపెనీ మే నెల నుంచి దశల వారీగా కామెట్ వాహన డెలివరీలను మొదలుపెడుతుంది. కామెట్ ఎలక్ట్రిక్ వాహనం, మరమ్మతులు, సర్వీస్ వ్యయాలను కవర్ చేస్తూ ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.

ఈ కారు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇ-షీల్డుతో వస్తుంది. ఈ స్పెషల్ 3-3-3-8 ప్యాకేజ్ వీటిని అందజేస్తుంది. ఇందులో 3 సంవత్సరాలు లేదా 1లక్ష కిలోమీటర్ల వారంటీ, 3 సంవత్సరాల రోడ్ సైడ్ సహాయత (RSA), 3 ఉచిత లేబర్ సర్వీసులు- షెడ్యూల్ చేయబడిన మొదటి 3 సర్వీసులు ఉన్నాయి. 17.3 kWh Li-అయాన్ బ్యాటరీ IP67 రేటింగ్ మరియు ప్రిస్మాటిక్ సెల్స్ తో 8 సంవత్సరాలు లేదా 1 లక్షా 20 వేల కిలోమీటర్ల వారెంటీతో వస్తుంది.
అదనంగా, ఎంజీ కామెట్ విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన వారికి ఈ కారు డిజైన్ చేయబడిన 80కి పైగా పొడిగింపు వారెంటీ సర్వీస్ ప్యాకేజీలు అందిస్తుంది. వీటిని కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చు. తమ తదుపరి ఎంజీకి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా బై-బ్యాక్ ప్రోగ్రామును కూడా ఎంజీ అందజేస్తోంది. కస్టమర్లు ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని కొనుగోలు చేసినప్పుడు, 3 సంవత్సరాల ఆఖరులో, వారు ఒరిజినల్ ఎక్స్-షోరూమ్ విలువ భరోసాతో 60% బై-బ్యాక్ పొందుతారు.
కామెట్ విద్యుత్ వాహన వేరియంట్లు ప్రతి ఒక్కటీ సులభమైన అనేక సర్వీస్ ఆప్షన్లను అందిస్తాయి. ఇందులో My MG యాప్ ద్వారా DIY, కాల్ మీద సర్వీస్ (రిమోట్ సహాయత), ఇంటివద్దనే సర్వీస్, కారును వర్క్‌షాపునకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏర్పడిన అరుదైన సమయాలలో పికప్/డ్రాప్ సర్వీసు వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








