MG Comet EV విడుదలైన పొట్టికారు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్.. ఈ కారు చాలా గట్టిదండోయ్..!

ఎంజీ మోటార్ ఇండియా ఎట్టకేలకు తన కొత్త కామెట్ ధరలను ప్రకటించింది. ఈ కొత్త కారు ధర రూ.7.98(ఎక్స్ షోరూమ్) లక్షలుగా సంస్థ ప్రకటించింది. దీని ప్రైస్ విషయంలో వచ్చిన ఊహాగానాలను తెరదించుతూ అతి తక్కువ ధరలో ఈ అధునాతన కారును తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ సంస్థ నుంచి విడుదైలన రెండో ఉత్పత్తిగా ఈ కారు భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. రేపటి నుంచి (ఏప్రిల్ 27) టెస్ట్ డ్రైవ్ కోసం ఈ కారును ప్రదర్శించనున్నారు. మే 15 నుంచి కస్టమర్లకు ఈ కారు అందుబాటులోకి రానుంది.

MG Comet Release

మూడు డోర్లు కలిగి ఉన్న ఈ ప్రత్యేక కారు స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ సిటీ కారుగా గుర్తింపు పొందనుంది. ఎంజీ మోటార్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న రెండో ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలువనుంది. ఈ కారుకు పేరు వెనక ఓ చరిత్ర ఉందని చెప్పవచ్చు. 1934సంవత్సరంలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న బ్రిటిష్ విమానం నుంచి ఈ కారుకి కామెట్ అని నామకరణం చేశారు.

గుజరాత్ లోని కంపెనీ మాన్ ఫాక్చర్ యూనిట్ లో వీటిని సంస్థ తయారు చేస్తుంది. కామెట్ EV SAIC (షాంఘై ఆటోమేటిక్ ఇండస్ట్రీ కార్పరేషన్) జనరల్ మోటార్స్ వులింగ్ మధ్య జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేయబడిన GSEV (గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించారు.

వులింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ సరికొత్త కామెట్ EV పూర్తి-వెడల్పు LED లైట్ బార్ వంటి ఆసక్తికరమైన టచ్‌లతో కూడిన బాక్సీ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. దీనిని MG ఎక్స్‌టెండెడ్ హారిజోన్ కనెక్టింగ్ లైట్స్ గా పిలుస్తుంది. దానితో పాటుగా, రెండు వింగ్ మిర్రర్‌లను కలుపుతూ క్రోమ్ మరియు పియానో ​​బ్లాక్ స్ట్రిప్ కూడా ఉంది. కామెట్ EV కోసం ఛార్జర్ కూడా ముందు భాగంలో, లైట్ బార్ కింద రానుంది.

ఇక దీని కొలతల పరంగా చూస్తే MG కామెట్ EV పొడవు 2,974 mm, వెడల్పు 1,505 mm, 1,640 mm ఎత్తుతో రానుంది. కేవలం 2,010 మిమీ వీల్ బేస్ తో ఈ కారుని సంస్థ తీసుకువస్తుంది. MG కామెట్ మూడు-డోర్ల సెటప్‌ను కలిగి ఉంది. ఈ కారు బయట LED DRLలు, LED హెడ్‌లైట్లు, LED టర్న్ సిగ్నల్స్‌తో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను చూడవచ్చు.

ఇది 17.3 kWh పవర్ ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ పరిధి రేంజ్‌ను అందించనుంది. కామెట్ EV 41 bhp వద్ద 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. 3.3 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

MG Comet Price

కామెట్ EVలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. ప్యాసింజర్ సీటులో వన్-టచ్ టంబుల్ ఫోల్డ్ ఫీచర్ ఉంది. వెనుక సీట్లు 50:50 స్ప్లిట్‌ను పొందుతాయి. కామెట్‌లో గేర్లను సులభంగా మార్చుకునే రోటరీ డ్రైవ్ సెలెక్టర్‌(స్విఛ్)ను కూడా కలిగి ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మాన్యువల్ ACఆపరేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మూడు USB పోర్ట్‌లతో సహా 55కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ఈ కామెట్ EVలోని భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే ఇది ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రివర్స్ కెమెరా, సెన్సార్‌లు అలాగే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 26, 2023, 13:01 [IST]
English summary
Mg comet ev released in india price and features details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+