MG Comet త్వరలోనే రాబోతున్న పొట్టి కారు.. ఆకర్షిస్తున్న ఫీచర్స్, రేంజ్, డిజైన్..!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిపోతుంది. అందులో భాగంగా ప్రస్తుతం కార్ల తయారీ సంస్థలు EVలను తయారు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఆకర్షణీయమైన రేంజ్, ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వెర్షన్ లేదా మోడల్ కార్లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే చాలా కార్ల కంపెనీల కార్లు మార్కెట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు MG కామెట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు వచ్చే నెలలో కొనుగోలు చేసేందుకు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ కారుకి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించింది. చిన్న చిన్న అప్ డేట్స్ తో వినియోగదారుల్నీ ఆకర్షిస్తూ వస్తున్న ఈ రెండు డోర్ల MG ఎలక్ట్రిక్ కారుని భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ ఆఖరి వారంలో లేదా మే నెలలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

mg comet ev

పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ తో ఈ కారు పనిచేయనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, త్వరలోనే విడుదల కాబోయే MG కామెట్ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండనుంది. ఇది 41.4 bhp వద్ద 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ కారు వెనుక భాగంలో యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.

ఇక ఈ కారులోని ఛార్జింగ్ విషయానికి వస్తే, MG కామెట్ ఎలక్ట్రిక్ కారు 3.3kW AC ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 5 గంటల్లో 0 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారుని ఫుల్ ఛార్జ్ చేయాడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది. ఫుల్ ఛార్జ్ లో ఈ కారు 230 కి.మీ రేంజ్ ని అందించనుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

ఈ కారులో అధునాతన ఫీచర్లను పొందవచ్చు. ఈ కొత్త MG కామెట్ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే తో రానుంది. టచ్‌స్క్రీన్ ఆధారంగా ఇది పనిచేయనుంది. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉండనున్నాయి.

ఇక ఈ కారులో స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. పవర్-ఫోల్డింగ్ ORVMలు, కనెక్ట్ కార్ టెక్, Apple CarPlay తో పాటు Android Auto వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉండనుంది. LED హెడ్‌లైట్‌లు, యాంబియంట్ లైటింగ్ వంటివి ఈ కారుకి అదనపు లుక్ ని ఇవ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఈ కారు కలిగి ఉంది.

కొత్త MG కామెట్ ఎలక్ట్రిక్ కారు 2,974 mm పొడవును కలిగి ఉండనుంది. ఇక 1,505 mm వెడల్పు, 1,613 mm ఎత్తులో కంపెనీ డిజైన్ చేసింది. కేవలం 2,010 mm వీల్ బేస్ మాత్రమే ఈ కారు కలిగి ఉండటం గమనార్హం. ఈ కారు టాటా నానోను పోలి ఉండనుంది. అతి చిన్న సిటీ కమ్యూటర్ కారుగా ఇది నిలువనుంది. ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చాక ఈ కారు తన సత్తాను చాటుతుందని తెలుస్తోంది.

ఇక ఈ కారు ధర విషయానికి వస్తే దాదాపు రూ.10 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సరికొత్త టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గట్టి పోటీని ఇవ్వనుంది. మరెన్నో కార్లకు ఇది సవాల్ విసురుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎంజీ మోటార్ ఇండియా నుంచి జెడ్ఎస్ పేరుతో ఇప్పటికే ఓ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. భారతదేశంలో ఎంజీ మోటార్ నుంచి రిలీజైన తొలి ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలిచింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ కామెట్ ఈవీ విడుదల కానుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ పెరుగుతుండటంతో ఈ స్మార్ట్ కాంపాక్ట్ కారు భారతీయ మార్కెట్ లో తన సత్తాను చాటే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 20, 2023, 12:18 [IST]
English summary
Mg comet ev unveiled and expected to launch in april month end details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+