మార్కెట్‌లోకి MG కామెట్‌ ఈవీ స్పెషల్‌ గేమర్‌ ఎడిషన్‌ విడుదల.. ఈవీ సెగ్మెంట్‌లో మొట్టమొదటి కస్టమైజ్డ్ కారు..

ప్రముఖ ఆటో బ్రాండ్‌ ఎంజీ మోటార్స్‌ నేడు భారత మార్కెట్‌లోకి MG కామెట్‌ ఈవీ స్పెషల్‌ గేమర్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. రూ. 8.65 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరలో ప్రవేశపెట్టింది. కామెట్‌ ఈవీ వేరియంట్లు పేస్‌, ప్లే, మరియు ప్లష్‌ కార్లతో పోలిస్తే దీని ధర రూ. 64,999 ఎక్కువగా ఉంది.

గేమర్‌ ఎడిషన్‌ పేరుతో కామెట్ ఈవీ ఆల్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ఎంజీ మోటార్స్‌ ప్రకటించింది. గేమర్‌ ఎడిషన్‌ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్‌ కవర్‌, ధీమ్‌డ్‌ మేట్స్‌ లాంటి స్పెషల్‌ యాక్సెసరీస్‌తో ఆకర్షణీయంగా ప్రవేశపెట్టింది.

MG-Comet-EV-Special-Gamer-Edition

ఇది ఈవీ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా కస్టమైజ్డ్‌ చేయబడిన కారుగా ఎంజీ మోటార్స్‌ పేర్కొంది. ఈ గేమర్‌ ఎడిషన్‌ అన్ని కామెట్‌ ఈవీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంజీ కామెట్‌ EV స్పెషల్‌ గేమర్‌ ఎడిషన్‌ను ఆసక్తి గల కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎంజీ డీలర్‌ షిప్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు.

బోల్డ్, వైబ్రంట్, డైనమిక్, టెక్నో వైబ్ నుంచి ప్రేరణ పొందిన ఈ కామెట్ EV గేమర్‌ ఎడిషన్.. గేమింగ్‌లోని అడ్రినలిన్‌ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అండ్‌ లైట్ థీమ్‌లలో ఎక్స్‌టీరియర్‌ను రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

MG-Comet-EV-Special-Gamer-Edition

కామెట్ EV 'గేమర్ ఎడిషన్' ఇంటీరియర్‌ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇందులో ఎక్కువగా నియాన్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. గేమింగ్ కమ్యూనిటీ అభిరుచికి అనుగుణంగా ఈ కారును తయారుచేశారు. కారు క్యాబిన్‌లోని యాంబియంట్ లైట్.. ఎంజీ కామెట్‌ ఈవీ గేమర్‌ ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా చేసింది.

గేమింగ్‌ స్ట్రీమర్‌, ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌ మోర్టల్‌ (నమన్ మాథుర్) సహకారంతో దీనిని రూపొందించారు. కామెట్ EV స్పెషల్ గేమర్ ఎడిషన్ వీల్స్‌ మరియు డోర్లపై నియాన్ ఎలిమెంట్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఇల్యూమినేటెడ్ స్టిక్కర్‌లను పొందుపరిచారు. MG కామెట్ EV క్యాబిన్ లోపల నియాన్‌ లైట్లతో అప్‌గ్రేడ్‌ చేశారు. కీ మరియు ఇతర ఇంటీరియర్‌ ఎలిమెంట్స్‌ను ప్రత్యేక ఆకృతి గల మెటీరియల్‌తో తయారుచేశారు.

దేశీయ మార్కెట్‌లో ఎంజీ కామెట్‌ ఈవీని రూ. 7.98 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో ఈ ఏడాది మేలో విడుదల చేశారు. ఎంజీ కామెట్‌ పేస్‌ వేరియంట్‌ ధర రూ. 7.98 లక్షలు, ప్లే వేరియంట్‌ రూ. 9.28 లక్షలు, పుష్‌ వేరియంట్‌ రూ. 9.98 లక్షలుగా ఉంది. దీని పొడవు 3 మీటర్లు, ఎత్తు 1640 మి.మీ, వెడల్పు 1505 మి.మీగా ఉంది.

కామెట్‌ ఈవీ జియో సిమ్‌తో అనుసంధానమై వస్తుంది. 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పవర్‌ విండోస్‌ లాంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇది 12-అంగుళాల స్టీల్ వీల్స్‌పై నడుస్తుంది. కామెట్ EV 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

ఎంజీ కామెట్‌ ఈవీ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో 230 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఇంకా ఈ కారు ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ ఇలా మూడు డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది. ఇది గరిష్ఠంగా 41 hp పవర్ అవుట్‌పుట్ వద్ద 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెటప్‌తో, కారు గంటకు గరిష్ఠంగా 100 km వేగంతో ప్రయాణించగలదు.

MG మరియు మోర్టల్ మధ్య ఈ సహకారం గేమింగ్ మరియు ఆటోమోటివ్ ప్రపంచాన్ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక డిజైన్ అంశాలు, ఫీచర్లతో పాటు MG కామెట్ గేమర్ ఎడిషన్ పనితీరు, ఆకర్షణీయ లుక్‌ గేమింగ్‌ ఔత్సాహికులను ఇట్టే ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, August 3, 2023, 17:56 [IST]
English summary
Mg comet special gamer edition launch in india price features and specs here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+