MG Comet EV ఏప్రిల్ 19న రెండు డోర్ల కారు ఆవిష్కరణ.. మైమరపించే ఆప్షన్స్

భారత్ లో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. పెట్టి కారుగా ఈ కారు తన సత్తాను చాటనుంది. మార్కెట్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కారు ప్రియులకు ఎంజీ మోటార్స్ సరికొత్త తీపి కబురును చెప్పింది. స్ట్రాంగ్ బ్యాటరీ రేంజ్ ఆఫర్లతో ఈ కారును ఆ సంస్థ విడుదల చేస్తుంది. సరికొత్తగా రానున్న ఎంజీ కామెట్ ఈవీ కారుని ఏప్రిల్ 19న ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొంది.

ఎంజీ మోటార్ నుంచి రెండు డోర్లు కలిగి ఉన్న స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ సిటీ కారును త్వరలో ఆ సంస్థ విడుదల చేయనుంది. ఎంజీ మోటార్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న రెండో ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలువనుంది. ఈ కారుకు పెట్టిన పేరుకు ఓ చరిత్రనే ఉందని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న 1934సంవత్సరానికి చెందిన బ్రిటిష్ విమానం నుంచి ఈ కారుకి కామెట్ అని నామకరణం చేశారు.

mg comet ev

రెండు డోర్లతో ప్రత్యేకంగా..
ఈ అతిచిన్న కారు కేవలం రెండు డోర్లతో మాత్రమే రానుంది. పేరుకే చిన్న కారు అయినా ఇందులో నలుగురు సులభంగా కూర్చొని ప్రయాణించేలా దీనిని ఎంజీ మోటార్స్ రూపొందించింది. అధునాతన ఫీచర్లతో ఈ కారు అందుబాటలోకి రానుంది. EV మార్కెట్ లో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు లభించనుందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు.

ఈ కారుకు అమర్చిన 25-kWh బ్యాటరీ ప్యాక్, 50 kWతో శక్తిని మోటార్ కు అందిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఈ కామెట్ లోని బ్యాటరీ LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తో రానుంది. ఇది కారుకు మెరుగైన బాటరీ లైఫ్ తో పాటు అధిక పెర్ఫార్మన్స్ అందిచనుంది. అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహనదారులకు అందుబాటులోకి ఉండనుంది.

మంచి డిజైన్ తో..
ఆకట్టుకునే డిజైన్, చిన్న కారుకు తగినట్లుగా మెయింటనెన్స్, ఫ్యూచర్ లో ఉపయోగ పడే EVమోటార్ వంటివి ఈ కారుకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందించేలా ఈ బ్యాటరీ ఉంటుంది. ఇక కారు లోపల ఇతర కంపెనీలకు ధీటుగా ప్రీమియం ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిజిటల్ డిస్‌ప్లే, కనెక్టెడ్ ఫీచర్స్ వంటి అధునాతన సదుపాయాలు ఉండనున్నాయి..

ఈ సరికొత్త కారు ఈవీ సెగ్మెంట్‌లో చరిత్ర సృష్టిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. రద్దీగా ఉండే పట్టణ నగరాల్లో ఈ చిన్న కారుతో సులభంగా డ్రైవింగ్‌ చేయవచ్చు. తక్కువ పార్కింగ్ స్థలం చిన్న చిన్న గల్లీలల్లో గంభీరంగా దీనిపై వెళ్లవచ్చు. ఈ డిజైన్ వినియోగదారులను సులభంగా ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది అర్బన్ ఈవీగా పేరొందనుంది. అలానే మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒ ట్రెండ్ సెట్ చేయనుంది.

ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ.10 లక్షల లోపే ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి ఫీచర్స్ విడుదలయ్యాకే తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే భారతీయ రోడ్లపై ఈ సరికొత్త ఎంజీ కామెట్ పరుగులు తీయనుంది. ఫర్ఫామెన్స్ తో పాటు ముఖ్య డిజైన్ లు అన్నీ లాంఛింగ్ తర్వాతే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఈ కారు ధర కొద్ది నెలల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే ఎంజీ మోటార్ ఇండియా నుంచి జెడ్ఎస్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనం ఉంది. భారతదేశంలో ఎంజీ మోటార్ నుంచి రిలీజైన తొలి ఎలక్ట్రిక్ కార్ ఇదే కావడం గమనార్హం. తదుపరి వచ్చేదే ఈ రెండో ఎలక్ట్రిక్ కార్ కామెట్ ఈవీ. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ పెరుగుతుండటంతో ఈ స్మార్ట్ కాంపాక్ట్ కారు భారతీయ మార్కెట్ లో తన సత్తాను చాటే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 11, 2023, 17:20 [IST]
English summary
Mg comet will debut on indian markets on april 19 details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+