దేశంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ 'నానో కారు'.. 250-300 కి.మీ రేంజ్!!

దేశంలో రోజు రోజుకు కార్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. వివిధ కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG భారత మార్కెట్ నూతన MG కామెట్ పేరుతో సరికొత్త EV కారును పరిచయం చేసింది.

చైనీస్ కు చెందిన SAIC (షాంఘై ఆటోమేటిక్ ఇండస్ట్రీ కార్పరేషన్) యాజమాన్యంలోని వులింగ్ నుంచి ఈ అధునాతన EV తీసుకువచ్చింది. భారతీయ రోడ్లపై ఈ కొత్త MG కామెట్ EV ఒకే ఛార్జీతో 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధిని అందించిందని సంస్థ పేర్కొంది.

ఎంజీ మోటార్

నానో కారుగా..

ముందుగా జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రవేశ పెడతారని అంతా భావించారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ MG నుంచి విడుదలైన ఈ కొత్త కారు.. ఒక్కసారిగా భారత మార్గెట్ లోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా ఈ కారు నానో విభాగంలో తన సత్తాను చాటనుంది. మార్కెట్ లోని ఇతర పోటీదారులకు ఈ కారు గట్టీ పోటినిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ప్రస్తుత కార్లలో టాటా టియాగో EVకి మంచి డిమాండ్‌ ఉంది. అయితే దీనికి పోటిగా ఎంజీ కంపెనీ గట్టీ పోటీ ఇవ్వనుంది. ఈ సరికొత్త కారు చూడడానికి నానో కారు రూపంలో ఉన్నప్పటికీ చాలా అధునాతన ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఈ కారులో మిగతా కార్లను తలదన్నే విషయాలు ఏమున్నాయో మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కామెట్ కారు..

సరికొత్త డిజైన్..

అతి చిన్న నాలుగు చక్రాల వాహనాల్లో ఒకటిగా MG కామెట్ EV నిలువనుంది. కేవలం 2,974 మిమీ పొడవుతో ఈ కారను సంస్థ రూపొందించింది. కామెట్ కంటే ముందు టాటా నానో చిన్న కార్ల జాబితాలో ఉంది. బజాజ్ క్యూట్ క్వాడ్రి సైకిల్ మాత్రమే ప్రస్తుతం మన రోడ్లపై తిరుగుతున్న అతి చిన్న ఏకైక ఫోర్-వీలర్ దానికంటే ఈ సరికొత్త మైక్రోకార్ కంటే చిన్నదిగా ఉండనుంది.

నలుగురు వ్యక్తులు సులభంగా ప్రయాణించేలా ఈ కారలో సదుపాయం కలదు. బాక్స్ ఆకారంలో ఇన్ సైడ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఈ కారు 2100mm వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. పూర్తిగా మినీకారు ప్రయాణిస్తున్న అనుభూతిని మీరు ఎక్కడా పొందలేరు. కావున ఇది బెస్ట్ చాయిస్ కారుగా చెప్పవచ్చు.

ఎంజీ మోటార్

250-300 కి.మీ రేంజ్..

MG కామెట్‌ ఈ ఎలక్ట్రిక్ మోటార్ కు చెందిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఆటో జర్నలిస్ట్ ల ప్రకారం బ్యాటరీ ప్యాక్ 20 kWh కంటే కొంచెం ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సరికొత్త నానోను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250-300 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇవ్వగలదని సమాచారం.

వెనుక టెయిల్‌ గేట్ నిలువుగా పేర్చబడిన లైట్లను కలిగి ఉండనుంది. అలాగే పూర్తి-వెడల్పు లైట్‌ బార్-శైలి బ్రేక్ లైట్‌ గా కనిపిస్తుంది. కామెట్ EV వైట్, ఎల్లో, బ్లూ, పింక్ నాలుగు కలర్ ఆప్షన్‌ లతో డ్యూయల్-టోన్ సెటప్‌ లో అందించబడనుంది.

మెరుగైన భవిష్యత్తు కోసం అర్బన్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని MG కార్లను రూపొందించినట్లు MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు. ప్రత్యేకమైన డిజైన్‌ ల నుంచి క్లీన్ మొబిలిటీ మరెన్నో అవసరాలను పరిగణలోకి తీసుకుని వీటిని రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫ్యూచర్ లో MG మోటార్స్ ప్రతి ఒక్కరికీ విశ్వాసాన్ని నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, March 3, 2023, 15:37 [IST]
English summary
Mg motor india christens its soon to be launched smart ev as comet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+