ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ EVపై రూ.2.3 లక్షల ధర తగ్గింపు..!

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ తాజాగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ జెడ్‌ఎస్‌ ఈవీ (MG ZS EV) ధరను భారీగా తగ్గించింది. ప్రస్తుతం MG ZS EV ఎక్సై్ట్‌, ఎక్స్‌క్లూజివ్‌, ఎక్స్‌క్లూజివ్‌ ప్రోతో వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఎక్సైట్‌ వేరియంట్‌ ధరను రూ.50,000 తగ్గించింది. ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.2,30,000 మరియు ఎక్స్‌క్లూజివ్‌ ప్రో వేరియంట్‌పై రూ.2,00,000ను తగ్గించింది. ధర తగ్గింపు అనంతరం ఈ ఎలక్ట్రిక్‌ కారు ప్రారంభ ధర రూ.22.88 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. 5 సీట్‌ వెర్షన్‌ కొనుగోలు అందుబాటులో ఉంది.

mg-zs-ev suv

MG ఎలక్ట్రిక్‌ కారును (MG Electric Car) ఒకే మోటార్‌ను కలిగి ఉంటుంది. మరియు 50.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ సింగిల్‌ మోటార్‌ గరిష్ఠంగా 174bhp శక్తి, 280Nm గరిష్ఠ టార్క్‌ను కలిగి ఉంటుంది. 50kW DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 0-80% వరకు ఛార్జింగ్‌ చేసేందుకు 60 నిమిషాల సమయం పడుతుంది.

అదే 7.4kW AC ఛార్జర్‌ను ఉపయోగించి ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 8.5 నుంచి 9 గంటల సమయం పట్టనుంది. ఎంజీ ZS ఎలక్ట్రిక్‌ SUV ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 419 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. మొత్తంగా ఈ కారు మెరుగైన రేంజ్‌ను కలిగి ఉంది.

mg-zs-ev-front-view

ఎంజీ ZS ఎలక్ట్రిక్‌ SUV గ్లేజ్‌ రెడ్‌, అరోరా సిల్వర్‌, స్టార్రీ బ్లాక్ మరియు క్యాండీ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారు అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 7 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, కనెక్టడ్‌ కార్‌టెక్, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, సన్‌రూఫ్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. BYD Atto3, హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్ వంటి కార్లకు గట్టిపోటీనిస్తోంది.

mg-zs-ev-interior-design

ఎంజీ మోటార్స్‌ ఇండియా సంస్థ కేరళలోని తిరువనంతపురంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సర్వీస్‌, సేల్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. దీంతోపాటు ఎంజీ మోటార్స్‌ సంస్థ దేశంలోని సుమారు 157 నగరాల్లో మొత్తం 340 కస్టమర్‌ టచ్‌ పాయింట్లను కలిగి ఉంది.

తక్కువ ధరలో ఎంజీ సంస్థ నుంచి కామెట్‌ ఈవీ (MG Comet EV) అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.7.98 లక్షల నుంచి రూ.9.98 లక్షల వరకు ఉంది. పేస్‌, ప్లే, ఫ్లష్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 17.3 kWh బ్యాటరీప్యాక్‌ను కలిగి ఉంటుంది. 42Ps శక్తి, 110Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 230 కి.మీ రేంజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 7, 2023, 11:11 [IST]
English summary
Mg zs ev attract with huge price drop ahead of festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+