MG ZS EV మోరిస్ గ్యారేజ్ నుంచి సరికొత్త కారు.. అదిరే సేఫ్టీ ఫీచర్లు, వీర లెవెల్ పెర్ఫామెన్స్

99 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటీష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజీ (MG)మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్‌ కారు జెడ్‌ఎస్‌ ఈవీని నేడు దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) లెవెల్ 2తో కొత్తగా అభివృద్ధి చేసిన ఈవీ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ.27.89 లక్షలుగా ఉంది.

కొత్త ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ (MG ZS EV) అడాస్ లెవెల్ 2 లో ఎన్నో భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ముందుగా మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధునాతన ఫీచర్లు, సాంకేతితకతో జెడ్‌ఎస్‌ ఈవీని ప్రవేశపెట్టింది. ఇది మూడు లెవెల్స్‌ అంటే తక్కువ, మధ్యస్థ, అధిక స్థాయిల ఆధారంగా పనిచేస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన హాప్టిక్, ఆడియో, విజువల్ ప్రత్యేకతలతో డ్రైవింగ్ అనుభవాన్ని, ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది.

MG-ZS-EV-Car

ట్రాఫిక్ జామ్ అసిస్ట్ (TJA) రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో కూడా ఇబ్బంది లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ (FCW) ద్వారా డ్రైవర్‌కు ఎదురయ్యే ప్రమాద వివరాలను తెలియజేస్తుంది. అంతే కాకుండా డ్రైవర్ నుంచి ఎటువంటి చర్య లేనట్లయితే ఆటోమేటిక్‌ విధానాన్ని అనుసరించి భద్రతను మరింత మెరుగుపరచడం మరో అడ్వాంటేజ్‌.

మరో సేఫ్టీ ఫీచర్‌ స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ (SAS) మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఓవర్ స్పీడ్ కాకుండా నియంత్రిస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) డ్రైవర్ అలసటను తగ్గించడంతో పాటు ముందు వెళ్తున్న వాహనం నుంచి సరైన దూరాన్ని పాటించేలా చేస్తూ భద్రతను పెంచుతూ, సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.

MG-ZS-EV-Car

ఇక జెడ్‌ఎస్‌ ఈవీలో బ్యాటరీ పనితీరును పరీక్షిస్తే ప్యూర్- ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీ భద్రత, పనితీరుతో ప్రవేశపెట్టారు. భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన జీవితకాలాన్ని అందిస్తుంది. ధూళి, నీటి నిరోధకతతో బ్యాటరీని ఐపి69కె (IP69K)కి అనుగుణంగా తయారు చేశారు. అలాగే యుఎల్2580 (UL2580) సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఎఎస్ఐఎల్-డి (ASIL-D)మెరుగుపరచబడిన భద్రతా సమగ్రత స్థాయి రేటింగ్‌కు అనుగుణంగా ఉంటుంది.

ఛార్జింగ్‌: ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ ఛార్జింగ్‌ విషయంలో ఎంజీ మోటార్స్ ఎక్కడా రాజీ పడలేదు. ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద డీసీ (DC)సూపర్-ఫాస్ట్ ఛార్జర్‌లు, ఇళ్లు మరియు కార్యాలయాల్లో ఉచితంగా ఇన్‌స్టాల్ చేసే ఏసీ (AC)ఫాస్ట్ ఛార్జర్‌లు వంటి ఆరు ఛార్జింగ్ సొల్యూషన్‌లను అందిస్తుంది.

MG-ZS-EV-Car

వాహనాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా ఆన్-బోర్డులో ప్లగ్-అండ్-ఛార్జ్ మరియు ఆర్‌ఎస్‌తో (రోడ్ సైడ్ అసిస్టెన్స్) ఛార్జ్-ఆన్-ది-గో మరియు కమ్యూనిటీ ఛార్జెస్ ఇలా ఎక్కడైనా ఛార్జ్‌ చేసుకోవచ్చు. 50.3 కిలోవాట్ ప్రిస్మాటిక్‌ బ్యాటరీ సామర్థ్యం పూర్తి ఛార్జ్‌పై 461 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. బ్యాటరీ 8 ఏళ్ల వారెంటీతో వస్తుంది.

ఇంకో విశేషమేమంటే ఈ కారును ఉపయోగించేందుకు ఒక్కో కి.మీకు 60 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఇతర కార్లతో పోల్చుకుంటే దీని రన్నింగ్ కాస్ట్ ఎంతో తక్కువ మాత్రమే కాకుండా మూడేళ్లలో రూ. 4 లక్షల వరకూ ఆదా అవుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

MG-ZS-EV-Car

ఎక్స్‌టీరియర్స్: ఇక జెడ్ఎస్ ఈవీ (ZS EV) ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ను పరిశీలిస్తే పూర్తి LED హాకీ హెడ్‌ల్యాంప్‌లు మరియు LED టెయిల్ ల్యాంప్‌లతో వస్తుంది. వీల్స్‌ R17 టోమాహాక్ హబ్ డిజైన్ అల్లాయ్‌తో రూపొందించబడ్డాయి. ఈ ఎస్‌యూవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

నాలుగు ఆకర్షణీయమైన కలర్స్‌లో అవి గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్ మరియు కాండీ వైట్ రంగులలో ప్రవేశపెట్టింది. జెడ్ఎస్ ఈవీ (ZS EV) ఐ-స్మార్ట్ (i-Smart)నెక్ట్స్- జెన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సేవలు మరియు అప్లికేషన్‌లను మిళితం చేసి 75+ కనెక్ట్ చేయబడిన కార్‌ ఫీచర్లను అందిస్తోంది.

ఫీచర్లు: జెడ్‌ఎస్‌ ఈవీ పూర్తి డిజిటల్ క్లస్టర్‌తో 17.78 సెం.మీ, ఎంబెడెడ్ ఎల్‌సీడీ స్క్రీన్, సెగ్మెంట్ లీడింగ్ 25.7 సెం.మీ. హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. స్కై రూఫ్, ఏసీ, మ్యూజిక్‌, నావిగేషన్‌ ఇలా ఆపరేట్‌ చేసేందుకు 100+ వీఆర్ కమాండ్‌లను కలిగి ఉంది. లైవ్ లొకేషన్ షేరింగ్, ట్రాకింగ్, వాతావరణ సూచన సమాచారాన్ని కలిగి ఉంది.

ఇంటీరియర్లు: భద్రత పరంగా, ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్ (HDC)ను కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్యూయల్, ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.

ఇంజిను: జెడ్ఎస్ ఈవీ 8-లేయర్ హెయిర్‌పిన్ మోటార్ 176 పీఎస్ శక్తిని అందిస్తుంది. ఈ కారు కేవలం 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ ఇలా మూడు డ్రైవింగ్ మోడ్‌లతో జెడ్‌ఎస్‌ ఈవీని ప్రవేశపెట్టింది.

ఈ కారు విడుదలపై ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)అటానమస్ లెవెల్ 2 అడాస్(ADAS) ను అత్యంత సేఫ్టీ ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం ఎంజీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.

Article Published On: Thursday, July 13, 2023, 17:22 [IST]
English summary
Mg zs ev launched with adas 2 features in india specs safety price details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+