Video రాత్రి సమయంలో రోడ్లపైకి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు.. స్టీరింగ్‌, క్లచ్‌, బ్రేక్‌ లేకుండానే..!!

డ్రైవర్‌ అవసరం లేని కార్ల గురించి సినిమాల్లోనే చూశాం. బయట ఇలాంటి కార్లు చాలా తక్కువ. అయితే ఇప్పుడిప్పుటే చాలా సంస్థలు ఇటువంటి కార్ల తయారీపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని సంస్థల కార్లను టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. అయితే రోడ్లపైకి వచ్చిన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సెల్ఫ్‌ డ్రైవింగ్ కారు అంటే వాహనం నడిపేందుకు డ్రైవింగ్‌ అవసరం ఉండదు. వాహనంలో ఉన్న సెన్సార్లు, కెమెరాలు, ఇతర టెక్నాలజీ ఆధారంగా బ్రేకింగ్‌, స్టీరింగ్‌ సహా ఎటు వైపునకు వెళ్లాలన్నా స్వయంగా నిర్ణయం తీసుకొనే సామర్థ్యం కలిగిన వాహనం అని అర్థం.

autonomous car spotted in Bangalore roads

తాజాగా బెంగళూరులోని ఓ రాత్రి సమయంలో ఈ కారు రోడ్లపైకి వచ్చింది. ఈ వాహనాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనిరుద్‌ రవిశంకర్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు టెస్ట్‌ రన్‌ను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

బెంగళూరుకు చెందిన మైనస్‌ జీరో సంస్థ ఈ కారును తయారు చేసింది. zPod పేరుతో పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వాహనం పరీక్షల దశలో ఉంది. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ కారు నడవనుంది. కారులో ప్రయాణికుల భద్రతకు ADAS (ఆడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌) సహా అనేక కీలక ఫీచర్లు ఉన్నాయి.

autonomous car spotted in Bangalore roads

అయితే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారును తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసే ఉద్దేశం తమకు లేదని జీరో మైనస్‌ సంస్థ వెల్లడించింది. ఫలితంగా ఈ కారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత లేదు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీని ఇతర వాహన తయారీ సంస్థలు వినియోగించుకోవచ్చని మైనస్‌ జీరో సంస్థ చెబుతోంది.

అయితే ఈ కారులో మాన్యువల్‌ నియంత్రించేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవు. స్టీరింగ్‌ వీల్‌, బ్రేక్‌, యాక్సలరేషన్‌ మరియు క్లచ్‌ వంటి ఫీచర్లు ఉండవు. కేవలం డిజిటల్‌ స్ర్రీన్‌ మాత్రమే ఉంటుంది. దీని ద్వారానే వాహనానికి కమాండ్‌ల రూపంలో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

autonomous car spotted in Bangalore roads

క్యాంపస్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వాహనం తయారు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఓ నిర్ణీత ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకొని, మరో ప్రాంతానికి మాత్రం తీసుకెళ్లగలుగుతుంది. ప్రఖ్యాత విద్యా సంస్థలు సహా ఇతర క్యాంపస్‌లో వినియోగించేందుకు వీలుగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య : ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలలు, రైల్వే స్టేషన్‌లు, ఇతర పార్క్‌లో బ్యాటరీతో నడిచే వాహనాలను ఉపయోగిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో ఈ తరహా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలను వినియోగించవచ్చు. అయితే ఈ కారును ఉత్పత్తిలోకి తెచ్చే ఉద్దేశం లేదని సంస్థ చెబుతోంది. అందువల్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అధిక సమయం పట్టే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 28, 2023, 19:45 [IST]
English summary
Minus zero zpod autonomous car spotted in bangalore roads video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+