Car Offers in Monsoon కొత్త కారు కొంటున్నారా.. ఈ టాప్ కంపెనీల కార్లపై బంపర్ ఆఫర్లు..
అతిపెద్ద కారు మార్కెట్ కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటి మరికొద్ది రోజుల్లో మాన్‌సూన్ ప్రవేశిస్తుండటంతో ప్రముఖ కార్ల కంపెనీలు మారుతి సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు తమ విక్రయాలను రెట్టింపు చేసుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. మరి ఏయే కారుపై ఎంతెంత తగ్గింపు ప్రకటించిదో వివరాలు మీకోసం.
మారుతి సుజుకి : నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే సరసమైన కార్లపై మారుతి సుజుకీ భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇగ్నిస్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇగ్నిస్ MT మరియు AGS వేరియంట్‌లు రూ.35,000 నగదు తగ్గింపుతో సహా పలు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ కారు ధర ఎక్స్ షో రూమ్‌లో రూ.5.84 లక్షల నుంచి రూ.8.16 లక్షల్లో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి యొక్క Ciaz వేరియంట్లు ఏవీ నగదు తగ్గింపును ప్రకటించలేదు. కార్పొరేట్ తగ్గింపు మరియు ఫ్లాట్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది. ఈ కారు ధర రూ. 9.30 లక్షల నుండి రూ. 12.29 లక్షల వరకూ ఉంది. కార్పొరేట్ ద్వారా రూ. 3,000 మరియు ఫ్లాట్ బోనస్ ద్వారా రూ. 25,000 తగ్గింపు లభించనుంది.
ప్రముఖ బాలెనో కారుపై కూడా మంచి తగ్గింపును మారుతి సుజుకీ అందిస్తోంది. సిగ్మా, జీటా, ఆల్ఫా (MT + AT) CNG వేరియంట్‌లు రూ.10,000 నగదు తగ్గింపుతో సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ కారు ధర ఎక్స్‌షో రూమ్‌లో రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.88 లక్షల వరకూ ఉంది. 22.35 - 22.94 kmpl మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కూడా తన కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios) రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపును ప్రకటించింది. ఈ కారు ధర ఎక్స్ షో రూమ్‌లో రూ.5.73 లక్షల నుంచి రూ.8.51 లక్షల వరకూ ఉంది.
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కారు i20. ఈ కారుపై రూ.10,000 నగదు తగ్గింపు మరియు రూ.10,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. రూ.7.46 లక్షల నుంచి రూ.11.88 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు ఇంజిన్ 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 19.65 నుంచి 21.0 kmpl మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ నుండి మరో కారు ఆరా డిస్కౌంట్ ఆఫర్ విషయానికొస్తే ఈ కారుపై రూ.20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఇది రూ.6.33 లక్షల నుండి రూ.8.90 లక్షల ధరలో ఉంది. పెట్రోల్ మరియు CNG ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.
మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు రానున్న వర్షాకాలంలో తమ అమ్మకాలను రెట్టింపు చేసుకునేందుకు భారీ తగ్గింపులను అందించడంతో పాటు మంచి వృద్ధిని సాధించే దిశగా కృషి చేస్తున్నాయి. అయితే, ఈ రాయితీ సౌకర్యాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. మరింత సమాచారం కోసం సమీపంలోని షోరూమ్‌ని సందర్శించాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








