తక్కవ ధరలో ఈ ఆటోమేటిక్ కార్లు చాలా ఫేమస్..
రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆటోమేటిక్ కార్లు నడపడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. మనలో చాలా వరకు మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనదేశంలో వీటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మన దేశంలో సరసమైన ధరలకు లభిస్తున్న టాప్ 5 ఆటోమేటిక్ కార్ల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం.
మారుతి సుజుకి ఆల్టో K10..
మారుతి సుజుకి ఆల్టో K10 ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న కారు. సరసమైన ధరలో ఇది అందుబాటులో ఉండటం వల్ల ఈ ఆటోమేటిక్ కారు కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఎక్స్ షోరూమ్ లో Alto K10 VXI (AGS) ధర రూ. 5.59 లక్షలుగా ఉంది. ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, సహజంగా-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. 65.7bhp వద్ద 89NM గరిష్ట శక్తిని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మిని SUVగా భావించే ఈ ప్రత్యేక హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో కారు.. ఆటోమేటిక్ వేరియంట్ లభిస్తుంది. ఈ మోడల్ ఆటోమేటిక్ వేరియంట్ VXI (O) ధర రూ.5.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఆల్టో K10 మాదిరి ఇంజన్ తో పాటు ఆ కారు ఉత్పత్తి చేసే శక్తిని ఈ కారు పొందుతుంది.

రెనాల్ట్ క్విడ్..
ఆటోమేటిక్ కార్లలో రెనాల్ట్ క్విడ్ ను ఓ మంచి ఆప్షన్ గా అభివర్ణించవచ్చు. సరసమైన ధరలో మంచి గేమ్ ఛేంజర్ కారుగా ఆప్షన్ లో పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గేర్ల కారులో ఈ ఫ్రెంచ్ మేకర్ విడుదల చేసిన RXT1.0 EASY-R వేరియంట్ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 67bhp వద్ద 91Nm గరిష్ట టార్క్ శక్తిని ఈ కారు ఉత్పత్తి చేస్తుంది. 1.0-లీటర్, 3-సిలిండర్, సహజ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో ఈ కారు శక్తిని పొందుతుంది.
మారుతి సుజుకి సెలెరియో..
ఆటోమేటిక్ కార్లలో మీరు కొనుగోలు చేయవల్సిన మరో ఆప్షన్ మారుతి సుజుకి సెలెరియో. ప్రత్యేకమైన ఈ హాచ్ బ్యాక్ కారు ఆటోమేటిక్ వెర్షన్ ధరలు రూ.6.37 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి మొదలవుతాయి. కొత్త సెలెరియో 1.0-లీటర్, 3-సిలిండర్, సహజ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 65.7bhp పీక్ పవర్ వద్ద 89Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకు ప్రత్యామ్నాయంగా భావించే కారు మరో కారు కొత్త మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. సరికొత్త టెక్నాలజీతో ఈ కారును మారుతి ప్రవేశ పెట్టింది. 1.0-లీటర్, 3-సిలిండర్, సహజ -ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో నడిచే ఈ కారు.. 65.7bhp వద్ద 89Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి.
దేశంలో ఆటోమేటిక్ కార్ల గురించి వినియోగం పెరగడంతో కంపెనీలు సరికొత్త ఆటోమేటిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో ఈ కార్లు అందుబాటులోకి కొద్దిగా ఆలస్యంగా వచ్చినా.. ఇటీవల సంవత్సర కాలంలో ఈ కార్లకు భారీ డిమాండ్ పెరుగుతోంది. పెరిగిన ట్రాఫిక్ కారణంగా చాలా మంది ఇప్పుడు ఆటోమేటిక్ కార్లను ఇష్టపడుతున్నారు.
ఇకపై కారు కొనాలనుకునే వారు ఆటోమేటిక్ కార్లపై దృష్టి సారిస్తే బాగుంటుంది. రద్దీ ప్రాంతాలతో పాటు ప్రమాద సందర్భాలలో ఈ ఆటోమేటిక్ కార్లు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. మార్కెట్ లో లభిస్తున్న ఈ మోడల్ కార్లను కొనుగోలు చేయడంలో కాస్త శ్రద్ధ వహిస్తే సుఖ ప్రయాణాన్ని సాగించవచ్చు.


Click it and Unblock the Notifications








