Most Loyal Fan Base Cars ఏళ్ల తరబడి అత్యంత నమ్మకం, విశ్వసనీయత, అధిక ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న కార్లు ఇవే..!

భారత్‌లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కార్లు మాత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉన్నాయి. మార్కెట్లో రోజు రోజుకు కొత్త మోడళ్లు వస్తున్నప్పటికీ, కొన్ని కార్లు అభిమానుల హృదయాలను, విశ్వసనీయతను నిలబెట్టుకోవడంలో టాప్‌లో ఉన్నాయి. ఇక్కడ మీకోసం అత్యంత నమ్మదగిన కార్ల వివరాలను అందిస్తున్నాం..

దేశంలో ఎన్ని కార్లు ఉన్నకానీ అత్యంత ఫ్యాన్ బేస్‌ మోడ్‌ కల్గిన కార్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నమ్మకమైన కార్లకు ఏటా అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ జాబితాలో మహీంద్రా, టాటా మోటార్స్, హోండా, టయోటా, మారుతి సుజుకిలకు చెందిన కార్లు ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ కార్లను వినియోగదారులు విక్రయిస్తూనే ఉన్నారు.

maruti alto

మారుతి సుజుకి ఆల్టో: అత్యంత ఫ్యాన్ బేస్ కల్గిన జాబితాలో మారుతి సుజుకి ఆల్టో తొలి స్థానంలో ఉందని చెప్పవచ్చు. రెండు దశాబ్దాలకు పైగా ఈ కారు తన హవాను కొనసాగిస్తోంది. తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే భారతీయులకు ఈ కారు మంచి ఎంపికగా ఉంది. అందువల్ల ఈ కారు అత్యంత ఫ్యాన్ బేస్ ని పొందింది.

దీని కాంపాక్ట్ డిజైన్, ఇంధన సామర్థ్యం తక్కువ నిర్వహణ ఖర్చులు ఉండటంతో భారతీయ కుటుంబాలలో ప్రసిద్ధ ఎంపికగా మారింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ లో ఆల్టో అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నమ్మకమైన అభిమానుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.

tata safari

టాటా సఫారీ: అత్యంత నమ్మదగిన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న మరోకారు టాటా సఫారీ. లాంఛ్ చేయబడిన నుంచి ఈ SUV వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. దీనికి ఇంటి కారుగా మంచి పేరు ఉంది. సఫారీ భారతీయ రోడ్లపై బలమైన ఉనికిని కలిగి ఉన్న కార్లలో ఒకటిగా నిలిచింది. మంచి డిజైన్‌తో అందుబాటులో ఉంది. టాటా సఫారీ 2021 లో సరికొత్త అవతారంలో ప్రవేశపెట్టబడింది. అయితే దాని పాత మోడల్ ని ఎక్కువగా వాహన ప్రియులు ఇష్టపడేవారు.

 toyota fortuner

టయోటా ఫార్చ్యూనర్: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్యూవీలలో ఒకటి, ఇది దాని మన్నిక, సౌకర్యం మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో సులభంగా ప్రయాణం చేసే నమ్మకమైన అభిమానులను కలిగి ఉంది. ఫార్చ్యూనర్ ఒక దశాబ్దానికి పైగా తనదైన శైలిలో దూసుకెళ్తుంది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలలో ఒకటిగా ఉంది. దీని శక్తివంతమైన ఇంజిన్, విశాలమైన ఇంటీరియర్స్, డిజైన్ కుటుంబాలకు మరియు సాహస ఔత్సాహికులకు ప్రసిద్ధ ఎంపికగా చేస్తుంది.

honda city car

హోండా సిటీ: ఈ మిడ్-సైజ్ సెడాన్, ఇది రెండు దశాబ్దాలకు అత్యధిక ప్యాన్ బేస్ ని కలిగి ఉంది. ఈ సిటీకి నమ్మకమైన అభిమానులు ఉన్నారు, ఇది దాని స్పోర్టీ డిజైన్, ఇంధన సామర్థ్యం మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ హోండా సిటీ కారుని సంవత్సరాలుగా అనేక అప్‌గ్రేడ్‌లతో సంస్థ తీసుకువచ్చింది. ఇప్పటికీ దీనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఆకర్షణను నిలబెట్టుకుంది. దీంతో ఈ కారు కొనుగోలుదారులలో ఒక ప్రసిద్ధ ఎంపికగా మారింది.

mahindra scorpio classic


మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ఈ ఎస్‌యూవీ అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. చాలా కాలంగా ఉన్న . స్కార్పియో క్లాసిక్ అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ఇంజన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో వినియోగ దారుల మన్నను పొందింది. దీంతో ఇది అత్యంత నమ్మకమైన ఫ్యాన్ బేస్ ని కలిగి ఉంది. స్కార్పియో క్లాసిక్ సంవత్సరాలుగా అనేక మార్పులు చేసింది. అయితే ఇప్పటికీ దాని పాత మోడల్ ప్రపంచ ఆకర్షణను నిలుపుకుంది. ఇది రైండింగ్ ఔత్సాహికులకు మంచి ప్రజాదరణ పొందిన ఎంపికగా మారింది.

More from DriveSpark

Article Published On: Friday, May 12, 2023, 12:28 [IST]
English summary
Most loyal fan base cars in india details in telugu
Read more on: #కార్లు #cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+