Reliable Cars In India అత్యంత నమ్మదగిన కార్లు.. ఇవి ఉంటే చాలు లైఫ్ ఇక బిందాస్
భారత్‌లో కార్లు కొనేముందు చాలా మందికి ఏ కారు కొనాలో తెలియక సతమతమవుతారు. ఈ విషయంలో భిన్నభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళతారు. తమకు నచ్చిన మోడల్ దొరికే వరకు దానిపై తీవ్ర పరిశోధన చేస్తారు. ఇందుకు కారణం ప్రస్తుతం మార్కెట‌్‌లో చాలా రకాల కార్లు అందుబాటులో ఉండటమేనని చెప్పవచ్చు.
కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కారుపై వినియోగదారుడికి విశ్వసనీయత(నమ్మకం) అనేది ముఖ్యమైన అశంగా ఉంటుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, రోడ్డు సౌకర్యం లేని దారుల్లో ప్రయాణించడం, దీర్ఘకాలంలో పనిచేసే వంటి కార్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కింద ఉన్న కార్లు చాలా నమ్మదగినదిగా భావించవచ్చు.

మారుతి ఈ బ్రాండ్ భారత్‌లో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ నుంచి వచ్చిన మారుతి సుజుకి ఆల్టో 800 విశ్వసనీయతకు మారు పేరుగా చెప్పవచ్చు. బేసిక్ మోడల్ లో ఈ కారు అత్యంత ప్రజాదారణ పొందింది. మారుతి సుజుకి ఆల్టో 800 ప్రారంభ ధర రూ.3.54 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే BS6 ఫేజ్ 2 నియమాలు కచ్చితం చేయడంతో ఈ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు మారుతి ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ జాబితాలోని రెండవ కారు మారుతి సుజుకి డిజైర్.ఈ కారును భారీ సంఖ్యలో వినియోగదారులు ఈ కారును ఉపయోగిస్తున్నారు. ఈ కారుకి ఉన్న క్రేజ్ కారణంగా మార్కెట్‌లో ఇప్పటికి తన సత్తాను చాటుతుంది. ఎక్కువ సంవత్సరాలు మంచి సర్వీస్‌ను అందిస్తుండటం కారణంగా యజమానులు ఈ కారును నమ్ముతారు. మారుతి సుజుకి డిజైర్ ప్రారంభ ధర రూ.6.51 లక్షలుగా ఉంది.
హోండా సిటీ భారత్‌లో ఈ కారు చాలా ఫేమస్. భారతీయ మార్కెట్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ కారు విరాజిల్లుతోంది. ఈ కారు i-VTEC పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంది. ఈ ఇంజన్ జపనీస్ సెడాన్లకి అత్యుత్తమ ఫర్పమెన్స్‌ని అందిస్తుంది. ఈ ఇంజన్లు వర్క్ హార్స్‌గా ప్రసిద్ధి చెందాయి. అందుబాటులో ఉన్న కార్లలో అత్యంత విశ్వసనీయమైన పెట్రోల్ పవర్ట్రెయిన్లలో ఒకటిగా ఈ కారు ఉంది.. హోండా సిటీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.49 లక్షలతో ప్రారంభమవుతుంది.

మహీంద్రా బొలెరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంత మార్కెట్లలో ఈ కారు ఎక్కువగా సేల్ అయ్యింది.. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న అత్యంత మన్నికైన వాహనాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మహీంద్రా బొలెరో ప్రారంభ ధర రూ.9.78 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా దూర ప్రయాణాలకు ప్రసిద్ధి చెందింది. విశాలమైన స్థలం ఇందులో కలదు. వినియోగదారులకు అత్యంత నమ్మదగిన కార్లలో ఇది ఒకటిగా ఉంది. ఇటీవల ఈ కారు విరివిగా వినియోగంలోకి రావడంతో పాటు ప్రతి కస్టమర్‌ని తన ఖాతాలో వేసుకుంది. మారుతి సుజుకి ఎర్టిగా ప్రారంభ ధర రూ.11.49 లక్షలుగా ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా అనేది పేరొందిన ఎంపీవీగా గుర్తింపు పొందింది. ఇది Hilux పికప్‌పై ఆధారపడి ఉంటుంది నమ్మదగిన బలమైన ఆర్కిటెక్చర్ ఈ కారులో చూడవచ్చు. ఈ ఎంపీవీకి మార్కెట్‌లో ప్రజాదరణ పొందింది. టయోటా ఈ ఎంపీవీని గత సంవత్సరం నిలిపివేసిన తరువాత ఇటీవల భారత మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ.19.99 లక్షలుగా ఉంది.
టయోటా ఫార్చ్యూనర్ అనేది కంపెనీకి చెందిన మరొక వాహనం. ఇది కూడా Hilux పికప్‌ను కలిగి ఉంది. పెద్ద ఇంజన్, SUVబాడీ & సస్పెన్‌తో వస్తుంది. ఇది ఎల్లప్పుడూ నమ్మదగిన వాహనంగా ఉంది. ఇది భారతీయ ప్రేక్షకులలో ఇప్పటికి గొప్ప ఎంపికగా ఉంది. టయోటా ఫార్చ్యూనర్ ప్రారంభ ధర రూ.32.59 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








