కారు కొనేవారు కాస్త ఆగండి.. ఈ నెలలో వస్తున్న కార్లు చాలా బెటర్..!
మార్చిలో సరికొత్త కార్లు మన ముందుకు రాబోతున్నాయి. కొత్త సెడాన్లు, SUV మోడళ్లలోని ముఖ్యమైన కార్లు ఈ మార్చి నెలలోనే విడుదల కానున్నాయి. వాటిలో చాలా వరకు BS6 ఫేజ్ 2 నార్స్మ్ తో కూడిన అప్‌డేట్స్ లో వస్తున్నాయి. వీటిలో రెండు కొత్త కార్లు రూ.20 లక్షల కంటే తక్కువ సెగ్మెంట్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఆ కార్ల జాబితాకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..

హోండా సిటీ..
ఈ నెలలో మొదటగా హోండా సిటీ నుంచి ఆ సంస్థ ఫేస్ లిప్ట్ కారును విడుదల చేసింది. మార్చి 2నుంచి ఈ కారు మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఇది SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉండనుంది.

బేస్ మోడల్ తో వచ్చే కారులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రానుంది. మిగిలిన మూడు వేరియంట్లు CVT గేర్‌బాక్స్ లో రానున్నాయి. ADAS ఫీచర్లను ఈ కారు కలిగి ఉండనుంది. ఈ కొత్త కారు BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఈ కార్లలో డీజిల్ పవర్ ట్రెయిన్ ఉండదు.

టయోటా క్రిస్టా..
టయోటా నుంచి కొత్త ఇన్నోవా క్రిస్టా కోసం ఆ సంస్థ జనవరి 2023 నుంచే బుకింగ్స్ ని ఆహ్వానించింది. తాజాగా ఈ MPV ఇదే నెలలో అందుబాటులోకి రానుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ సరికొత్త క్రిస్టాకు జత చేయబడింది.2.4-లీటర్ డీజిల్ మోటారు తో అందించబడుతుంది. పూర్తిగా డీజిల్ తో మాత్రమే ఈ క్రిస్టా పనిచేస్తుంది. కొత్త ఇన్నోవా G, GX, VX, ZX వేరియంట్లలో అందించబడుతుంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ప్రకటించే అవకాశం ఉంది.

హ్యూందాయ్..
మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో అప్‌డేట్ చేయబడిన మరో మోడల్ కొత్త హ్యుందాయ్ వెర్నా. క్యాబిన్, కొత్త ఫీచర్లు, డిజైన్ స్టైలింగ్ తో ఆధునీకరించింది. దీనికి సంబంధించి ఇదివరకే బుకింగ్స్ ను ఆహ్వానిస్తోంది. రూ.25,000 లు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ధరలు మార్చి 21న వెల్లడికానున్నాయి. కొత్త వెర్నా పూర్తిగా పవర్ ట్రెయిన్ తో పనిచేస్తుంది. BS6 2.0-కంప్లైంట్ ఆధారంగా 1.5-లీటర్ సహజ-ఆస్పిరేటెడ్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లతో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లతో అందించబడుతుంది.
హ్యుందాయ్ పోర్ట్ ఫోలియోలో ఎక్కువ భాగం BS6 ఫేజ్ 2 కంప్లైంట్ పవర్ ట్రెయిన్ లతో అప్ డేట్ చేయబడినప్పటికీ, i20 ఇంకా అప్‌డేట్ అందుకోలేదు. ఈ మోడల్ లో డీజిల్ వేరియంట్ లు నిలిపివేయబడ్డాయి త్వరలో i20,i20 N లైన్ మోడల్ లకు BS6 2.0 అప్‌డేట్ ను జోడించి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్..
జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో మారుతి ఫ్రాంక్స్ ను సంస్థ పరిచయం చేసింది. ఇప్పటికే 6,000 బుకింగ్ లను సంపాదించింది. ఐదు వేరియంట్లు రెండు ఇంజన్ ఎంపికలలో ఈ కారు అందించబడుతుంది. మారుతి సుజుకి Fronx ధరలను ఇదే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఇది మారుతి నెక్సా లైనప్ లోని బాలెనో, బ్రెజా మధ్య వీటి ధర ఉండే అవకాశం ఉంది.
మారుతి సుజుకి తాజాగా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా RDE ప్రమాణాలతో E20 ఇంధన-కంప్లైంట్ వాహనాలను తీసుకువస్తుంది. స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్ ఆర్, అరేనా ,నెక్సా మోడళ్లలో దీనిని తీసుకురానుంది. ఇవి అప్ డేట్ చేయబడిన BS6 2 పవర్ ట్రెయిన్ లతో అమర్చబడతాయి. ఈ అన్ని మోడళ్ల ప్రీమియం ఎక్స్-షోరూమ్ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications








