తుది పరీక్షల్లో Citroen C3 ఎయిర్‌క్రాస్‌ SUV.. ఎప్పుడు విడుదల కానుందంటే.. ?

ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తన C3 ఎయిర్‌క్రాస్‌ SUVను భారత్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కారును భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ కారును మరోసారి పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ కారును రోడ్‌ టెస్ట్‌లో భాగంగా బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై గుర్తించారు. ఈ కారు స్టీల్‌ చక్రాలను కలిగి ఉంది. సీ3 ఎయిర్‌క్రాస్‌ ప్రస్తుతం తుది పరీక్షలు దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్ల టైర్లను బట్టి ఇది ఎంట్రీ లెవల్‌ SUV వెర్షన్‌గా తెలుస్తోంది.

citroen C3 aircross SUV Road testing

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గ్లోబల్‌ మార్కెట్‌లో ఆవిష్కరణ సందర్భంగా సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్ గురించి అనేక వివరాలు వెల్లడించింది. సీఎంపీ ప్లాట్‌ఫాంపై ఆధారపడిన సిట్రోయెన్‌ అదిపెద్ద వాహనాల్లో సీ3 ఒకటి. ఈ కారులో ఈ సంవత్సరం పండగ సీజన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ కొత్త సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయినప్పుడు హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా మరియు టాయోటా హిరిడర్‌ వంటి SUVలతో పోటీపడే అవకాశం ఉంది. సీ3 ఎయిర్‌క్రాస్‌ SUV 5, 7 సీట్ల వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు సీ3 హ్యాచ్‌బ్యాక్‌ నుంచి అధికంగా ప్రేరణ పొందినట్లు కనిపిస్తోంది.

citroen C3 aircross SUV Road testing

సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ ఫ్రెంచ్‌ కార్‌మేకర్‌ టర్బోఛార్జడ్ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. 108bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ద్వారా పవర్‌ ఫ్రంట్‌ వీల్స్‌కు పంపబడుతుంది. సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. మరియు 2,671 మిమీ వీల్‌బేస్‌ మరియు 200 మిమీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌.. సీ3 అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ మాదిరిగానే డిజైన్‌ ఉంటుంది. కారు మందు భాగంలో సిగ్నెచర్‌ X ఆకారంలోని పగటిపూట లైట్లు క్రోమ్‌ స్ట్రిప్స్‌ చెవ్రాన్‌ లోగోతో కనెక్ట్‌ చేయబడి ఉంటాయి.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌ అల్యూమినియం ఫినిషింగ్‌తో ఫ్రంట్‌ బంపర్‌ను కలిగి ఉంటుంది.

వృత్తాకారంలో ఫాగ్‌ ల్యాంప్‌ క్లస్టర్‌లతో చుట్టుబడినట్లుగా ఉండే డెడికేటెట్‌ ఎయిర్‌ ఇన్‌టేక్‌ ఉంటుంది. ఈ కారులో రౌండ్‌ వీల్‌ ఆర్చ్‌లు మరియు డోర్‌ల కింద బ్లాక్‌ క్లాడింగ్‌ ఉండడం గమనించవచ్చు. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో స్క్వారీష్‌ టెయిల్‌ల్యాంప్‌లు, పొడవైన బంపర్ మరియు టెయిల్‌గేట్‌ను కలిగి ఉంటుంది.

citroen C3 aircross SUV Road testing

ఈ ఎస్‌యూవీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తుంది. ఆపిల్‌ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంటుంది. 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. 7 సీటర్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ SUV వెర్షన్‌ బ్లోయర్‌ కంట్రోల్‌ రెండు, మూడో వరుస ప్రయాణికుల కోసం రూఫ్‌ మౌంటెడ్‌ ఏసీ వెంట్‌లను కలిగి ఉంటుంది.

సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ 5 సీటర్‌ వెర్షన్‌ 444 లీటర్ల బూట్‌స్పేస్‌తో వస్తుంది. అదే 7 సీటర్‌ వెర్షన్‌ 511 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం, పార్కింగ్‌ సెన్సార్‌లకో కూడిన రేర్‌ వ్యూ కెమెరా మరియు హిల్ హోల్డ్‌ అసిస్ట్‌తో వస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 17, 2023, 10:43 [IST]
English summary
New citroen c3 aircross suv spied testing ahead of launch this year festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+