సంచలనం.. 40కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే కార్లు.. త్వరలోనే విడుదల..!

భారత్ లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (SUV) జోరు కొనసాగుతోంది. అందులోనూ ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న కార్ల వైపు జనాలు దృష్టి సారిస్తున్నారు. అలానే కార్ల విక్రయాలలో మారుతి తమ సత్తాను చాటుతోంది. అధిక సంఖ్యలో కార్ల ఔత్సాహికులు మారుతి కార్లను ఎంచుకుంటున్నారు. తాజాగా మారుతి నుంచి అధిక మైలేజ్ ని అందించే కార్లను ఆ సంస్థ ప్రకటించింది.

మారుతిలో బాగా పేరొందిన స్విఫ్ట్ తో పాటు డిజైర్ న్యూ వెర్షన్ కార్లను ఆ కంపెనీ తీసుకురానుంది. ఈ కార్లు 2024 తొలిభాగంలో విడుదల కానున్నాయి. ఓ వైపు SUVలపై దృష్టి సారిస్తూనే, మారుతి తన అమ్మకాలకు వెన్నుముకగా ఉన్న కాంపాక్ట్ కార్లపై కూడా దృష్టి సారిస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న ఈ మోడల్‌ కార్లకు సంబంధించిన వివరాలు మీకోసం..

మారుతి కార్లు

మారుతి నుంచి రాబోయే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, డిజైర్ కాంపాక్ట్ సెడాన్ లు మార్కెట్ లో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్ లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. హైబ్రిడ్ మోడల్ లో ఈ కార్లు విడుదల కానుండటంతో స్విఫ్ట్, డిజైర్‌లకు మరింత ఆదరణ పెరగనుంది. ఈ కొత్త కారు 1.2-లీటర్, 3-సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ Z12E అనే కోడ్ నేమ్ తో పనిచేస్తుంది. హై ఎండ్ వేరియంట్లలో K12C ఇంజన్‌ ఈ కార్లు రానున్నాయి.

ఇప్పటికే మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లలో ఈ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ టెక్నాలజీని చూడవచ్చు. గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దేశంలో బాగా ప్రసిద్ధి చెందాయి. ఈ రెండు SUVలు 27.97 kmpl మైలేజీని అందించనున్నాయి. అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందించే కొన్ని కార్లలో గ్రాండ్ విటారా, హైరైడర్ కార్లు ఉన్నాయి. మైలేజీ పరంగా స్విఫ్ట్, డిజైర్ కార్లు ఈ కార్లకు గట్టీ పోటీని ఇవ్వనున్నాయి.

స్విఫ్ట్

35 నుంచి 40కి.మీ వరకు మైలేజ్..

స్విఫ్ట్, డిజైర్ లు దాదాపు 35 నుండి 40 kmpl మైలేజీని అందజేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అధిక ఇంధన సామర్థ్యం కోసం మారుతి సుజుకి దాని CAFE (కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ) రేటింగ్‌ను మెరుగు పరచనుంది. ఇది హైబ్రిడ్ వాహనాలకు 'సూపర్ పాయింట్స్' అందించనుంది.

మైలేజీ సంగతి అటుంచండి. ఇంత మైలేజ్ ఇస్తున్నాయి అంటే ధర విషయంలో సందేహం రాకపోదు. ప్రస్తుతం ఉన్న వెర్షన్ లతో పోలిస్తే ఈ కార్ల ధరలో పెద్ద పెరుగుదల ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే టయోటా నుండి హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న వాహనాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. కొత్త కార్ల ధరలు రూ.7.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డిజైర్

గట్టీ పోటీ..

మెరుగైన ఇంధన సామర్థ్యం, డిజైన్, సరసమైన ధర, గొప్ప ఫీచర్లతో స్విఫ్ట్, డిజైర్ కస్టమర్లను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. హైబ్రిడ్ వెర్షన్‌లలో కొన్ని మార్పులు కూడా ఉండవచ్చు. అంతే కాకుండా, మొత్తం స్పోర్టియర్ అనుభూతిని కూడా పొందవచ్చు. భారతదేశంలో అందుబాటులో ఉన్న హైబ్రిడ్ కార్లతో ఇవి ఏమేరకు పోటీని ఇస్తాయో తెలియాలంటే 2024 వరకు వెయిట్ చేయాల్సిందే.

దేశంలో EVల వాహనాల సంఖ్య వేగంగాపెరుగుతోంది. చాలామంది వీటిని ఎంచుకునేందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఛార్జింగ్ పాయింట్స్ అందుబాటులో ఉండటం అందులోనూ వీటిపై వస్తున్న వదంతుల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా సేల్ అవ్వడం లేదు. మారుతి సుజుకి డిజైర్, స్విఫ్ట్ కార్లు అందిస్తున్న ఇంధన ఫీచర్లు వీటిని ఏ విధంగా అడ్డుకుంటాయో చాడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 22, 2023, 17:27 [IST]
English summary
New gen maruti swift and dzire may give 35 to 40 kmpl mileage full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+