బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ వెర్నా ఒక్కరోజే 8,000 కార్ల బుకింగ్..
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కొత్త తరం వెర్నాను భారతీయ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పుడు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. మొత్తం సేల్స్ లో ఒక్కరోజే (21 మార్చి)లో 8000 పైగా యూనిట్లను బుక్ చేసుకున్నారు. సరికొత్త ఫీచర్లతో దీనిని తీసుకు రావడంతో జనాలు ఈ కారును సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు.
గత 17 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ సెడాన్ లు మంచి గుర్తింపును పొందాయి. వెర్నా మొదటిసారిగా 2006లో భారతదేశంలో ప్రారంభించబడింది. తొలిసారిగా చెన్నై ప్లాంట్ ద్వారా తమ ఉత్పత్తులను దేశంలో మొదలు పెట్టింది. అప్పటి నుంచి దాదాపు 4.5 లక్షల కస్టమర్లను సంపాదించింది. అలానే విదేశాలకు కూడా ఈ కార్లను ఎగుమతి చేసింది.

సరికొత్త ఫీచర్లతో..
కొత్త హ్యుందాయ్ వెర్నాను సంస్థ పూర్తి మార్పులు చేసి తీసుకువచ్చింది. సబ్-కాంపాక్ట్, మధ్య-పరిమాణ SUV ఆప్షన్లలో ఈ తాజా కారు అందుబాటులో ఉండనుంది. LED హెడ్‌ల్యాంప్‌ల పైన ఆకర్షణీయమైన LED స్ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. అలానే పారామెట్రిక్ జ్యువెల్ ఫ్రంట్ గ్రిల్ కూడా మోడల్‌కు పూర్తిగా కొత్తదనాన్ని తీసుకురానుంది. వెనుక వైపున, టెయిల్ ల్యాంప్‌ల మధ్య కనెక్ట్ చేయబడిన LED లైట్ బార్ ఉంటుంది. ఇది చూపరులను ఆకట్టుకోనుంది.
ఈ కారు పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది ఇది విశాలమైనది కూడా. మెరుగైన ప్రాక్టికాలిటీ కోసం, ఇది 528 లీటర్ల అతిపెద్ద బూట్ వాల్యూమ్‌ను కలిగి ఉంది. కొత్త వెర్నా పాత మోడల్‌తో పోలిస్తే 95 mm పొడవు, 36 mm వెడల్పు మరియు 70 mm పొడవైన వీల్‌బేస్‌తో ఉంది. వెలుపలి భాగం పారామెట్రిక్ డిజైన్ నమూనాలతో అలంకరించబడిన తాజా సెన్సుయస్ స్పోర్టినెస్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది.

ఇంజన్ లో సాటి..
6-స్పీడ్ మాన్యువల్ లేదా బేస్ వేరియంట్ లోని CVT లేదా హ్యుందాయ్ IVT యూనిట్‌తో జత చేయబడినప్పుడు 113 bhp వద్ద 144 Nm గరిష్ట టార్క్‌ను ఈ కారు ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ నుంచి ఈ కారు పవర్ ను పొందుతుంది. టాప్ ట్రిమ్‌లు 158 bhp వద్ద 253 Nm గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది.
1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఆప్షన్లతో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DCT యూనిట్‌తో జత చేయబడింది. వెర్నా టర్బో పెట్రోల్ దాని తరగతిలో VW Virtus, స్కోడా స్లావియా 1.5 TSI వేరియంట్‌లను అధిగమించి అత్యంత శక్తివంతమైన సెడాన్ గా ఇది గతంలో కూడా గుర్తించబడింది.

అందుబాటు ధరలో..
కొత్త వెర్నా మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ వంటి వాటితో ఈ కారు పోటి పడనుంది. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో ఈ కార్లు తమ సత్తాను చాటనున్నాయి. దీనికి సంబంధించి బేస్ వేరియంట్ కోసం 10.89 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుండగా.. టాప్ వేరియంట్ 17.37(ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








