Kia Sonet Facelift సరికొత్త అప్‌డేట్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ.. బుకింగ్‌లు ఆ రోజు నుంచే.!!
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. సోనెట్ సబ్-కాంపాక్ట్ SUV తో ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో నేడు కియా మోటార్స్ ఇండియా సోనెట్ ఎస్‌యూవీని సరికొత్త అప్‌డేట్‌లతో ఆవిష్కరించింది. కొత్త Kia Sonet Facelift ఆకర్షణీయమైన డిజైన్‌తో అధునాతన ఫీచర్లలో త్వరలో లాంచ్ కానుంది.
కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ.. డిజైన్‌తో పాటు ఫీచర్ల పరంగా అనేక మార్పులతో వస్తోంది. కాగా మూడేళ్ల క్రితం మార్కెట్లోకి లాంచ్ అయిన కియా సోనెట్ అప్పుడే ఫుల్ లోడెడ్ ఫీచర్‌తో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ సరికొత్త అప్‌డేట్లతో మన ముందుకొస్తోంది.

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌ను పరిశీలిస్తే.. ఇందులో సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్‌ను పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాగా ఈ సరికొత్త కారులో LED హెడ్‌లైట్ యూనిట్ కొత్త సెల్టోస్ మరియు కేరెన్స్‌లలో ఉన్న మాదిరిగానే ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త LED DRLలు షార్ప్‌గా ఉండటంతో పాటు.. రెండు చివర్లలో హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో SUV సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో అడ్జస్ట్ చేసిన బంపర్‌ను కూడా కలిగి ఉంది. ఇక ఇంటీరియర్ పరంగా కొత్త కియా సోనెట్ SUV ఫుల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో అప్‌డేటెడ్ అప్హోల్స్టరీతో కొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌ను చూడవచ్చు. కియా సోనెట్ వేరియంట్లను బట్టి ఇంటీరియర్ ఆప్షన్‌లను కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు.

కాగా కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUV టెక్ లైన్ ట్రిమ్‌లు మూడు ఇంటీరియర్ ఆప్షన్లతో వస్తాయి. ఈ కొత్త SUVలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, కొత్త సోనెట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ సౌండ్ సిస్టమ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో కియా హ్యాండ్స్-ఫ్రీ కనెక్టివిటీ, ఫంక్షన్‌ల కోసం అలెక్సా వాయిస్ కమాండ్‌లను కూడా సంస్థ అందిస్తోంది. కొత్త సోనెట్‌లో 25 సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయని కియా ఇండియా వెల్లడించింది.

కొత్త సోనెట్ కారులో అతి ముఖ్యమైన ఫీచర్ 10 అధునాతన సాంకేతిక లక్షణాలతో ADAS. అలాగే, కొత్త సోనెట్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణిక ఫీచర్‌గా అందించాలని కియా నిర్ణయించింది. ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఈ సబ్-కాంపాక్ట్ SUV 3,995 mm పొడవు, 1,790 mm వెడల్పును కలిగి ఉంది. కాగా ఈ కారు ఎత్తు 32mm పెరిగి 1642mm గా ఉంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUV యొక్క వీల్‌బేస్ కూడా ఏం మారకుండా 2,500 mm అలాగే ఉంది.

కాగా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఎస్‌యూవీ ఏడు వేరియంట్లలో సంస్థ ప్రవేశపెట్టింది. కాగా ఈ SUV బేస్ వేరియంట్‌ను HTE కాగా.. ఇతర వేరియంట్లు HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X లైన్. కాగా కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
కియా సోనెట్ SUV పెట్రోల్, డీజిల్‌తో సహా మూడు ఇంజిన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. ఇది 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 82 బీహెచ్‌పీ పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUV 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడా పనిచేస్తుంది. ఇది 118 bhp శక్తిని, 172 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
కాగా ఈ SUVలోని ఏకైక డీజిల్ ఇంజన్ 1.5-లీటర్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో సంస్థ ప్రవేశపెట్టింది.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయి. రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జనవరి 2024లో కారు లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్ సమయంలో కారు ధర, ఇంకా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








