మార్కెట్ ను ఏలేందుకు వస్తున్న మారుతి ఫ్రాంక్స్.. ఆ ఫీచర్లు హైలైట్..!

భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి మరో కారును అందుబాటులోకి తేనుంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. 2023 ఆటో ఎక్స్‌పోలో ఆ కంపెనీ నుంచి రాబోయే సరికొత్త ఫ్రాంక్స్ SUVని ఆవిష్కరించింది. తన కొత్త ప్రాంక్స్ SUVని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023 మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారు బాలెనో, గ్రాండ్ విటారాలకు మధ్య రకంగా ఉండనుంది. ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడనుంది. ఎప్పుడు లాంచ్ చేస్తామనే విషయాన్ని మారుతీ సుజుకి ఇంకా వెల్లడించలేదు.

మారుతి సుజుకి

ఐదు వేరియంట్లలో అందుబాటులో..

ఈ కొత్త ఫ్రాంక్స్ SUV టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త మారుతి ఫ్రాంక్స్ SUV మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడింది. కొత్త ఫ్రాంక్స్ కూపే SUV సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు తమకు ఇష్టమైన వేరియంట్‌ను ఎంచుకుంటారు.

ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఆర్టిన్ బ్రౌన్, స్లెయిన్ సిల్వర్, ఓపులెంట్ రెడ్, ఎర్త్ బ్రో విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఓపలెంట్ రెడ్ విత్ బ్లూష్ బ్లాక్ రూఫ్, స్లెయిన్ సిల్వర్ విత్ బ్లూ బ్లాక్ రూఫ్ కలర్లలో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు తమకు ఇష్టమైన కలర్ మోడల్‌ని ఎంచుకోవచ్చు.

హైబ్రిడ్ మోటార్..

మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో బూస్ట్ చేయబడిన మోటారును కలిగి ఉంది. ఇది 102 bhp వద్ద 150 Nm టార్క్‌ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ SUV 1.2-లీటర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలు 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు దీనికి జతచేయబడ్డాయి.

ఈ ఫ్రాంక్స్ SUV స్టైలింగ్, డిజైన్ కొత్త గ్రాండ్ విటారా బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లను పోలినట్లు ఉంటుంది. మారుతి Futuro-E కాన్సెప్ట్ మోడల్ మాదిరిగానే, మారుతి ఫ్రాంక్స్ దేశీయ విపణిలో లాంచ్ అయిన తర్వాత Nissan Magnite, Renault Kiger వంటి వాటితో పోటీపడుతుంది. SUV ఫ్రంట్ ఫాసియా బ్రాండ్ యొక్క కొత్త సిగ్నేచర్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.

మారుతి సుజుకి

అదిరే ఫీచర్లు..

SUV గ్రాండ్ విటారాలో చూసినట్లుగానే స్లిమ్ LED DRLలతో అలంకరించబడింది. ఈ ఫ్రాంక్స్ SUVలో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, రైజ్డ్ వెస్ట్‌లైన్, కూపే లాంటి రూఫ్‌లైన్, డోర్ రియర్ గ్లాస్ ఏరియా కూడా ఉన్నాయి. కొత్త మారుతి కూపే SUV లోపలి భాగం బాలెనో హ్యాచ్‌బ్యాక్‌తో పోలికలను పంచుకుంటుంది.

ఈ కొత్త మారుతి ఫ్రాంక్స్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. సిస్టమ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి కనెక్ట్ మరియు వాయిస్ కమాండ్‌లను కలిగి ఉంది. ఇది డిజిటల్ కన్సోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా మరియు వెనుక AC వెంట్‌లను కూడా పొందుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 18, 2023, 16:47 [IST]
English summary
New maruti suzuki fronx will launch likely in april here the full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+