మారుతి గ్రాండ్ విటారా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర & వివరాలు ఇక్కడ చూడండి
మారుతి సుజుకి ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదల చేసిన 'గ్రాండ్ విటారా' ను ఎట్టకేలకు ఇప్పుడు CNG వెర్షన్ లో తీసుకువచ్చింది. మారుతి గ్రాండ్ విటారా CNG ధర మరియు మైలేజ్ వంటి వివరాలు గురించి క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
మారుతి సుజకి తన గ్రాండ్ విటారా CNG ని రెండు ట్రిమ్స్ లో మాత్రమే విడుదల చేసింది. అవి డెల్టా (మ్యాన్యువల్) మరియు జీటా (మ్యాన్యువల్). వీటి ధరలు వరుసగా రూ. 12.85 లక్షలు మరియు రూ. 14.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). గ్రాండ్ విటారా S-CNG మారుతి యొక్క ఫ్లాగ్‌షిప్ SUV యొక్క మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌తో మాత్రమే అందించబడుతుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త మారుతి గ్రాండ్ విటారా S-CNG 1,462 సిసి ఫోర్ సిలిండర్ K15C డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ అనేది పెట్రోల్ మరియు CNG రెండింటిలోనూ పని చేస్తుంది. CNG మోడ్‌లో, గ్రాండ్ విటారా S-CNG లోని K15C ఇంజన్ 5,500rpm వద్ద 86.63bhp మరియు 4,200rpm వద్ద 121.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇంజిన్ 99.2bhp మరియు 136Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా CNG కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ CNG మోడల్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది 26.6 కిమీ/కేజీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఈ మైలేజ్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఈ CNG మోడల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నాము.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా CNG దాని పెట్రోల్ మోడల్ మాదిరిగానే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు 40 కి పైగా కనెక్టెడ్ సుజుకి కనెక్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, అమెజాన్ అలెక్సా కోసం సుజుకి కనెక్ట్ స్కిల్‌తో రిమోట్ వాయిస్ యాక్సెస్, వెహికల్ ట్రాకింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.
మారుతి గ్రాండ్ విటారా CNG యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కావున ఈ సేఫ్టీ ఫీచర్స్ ప్రయాణికులకు మంచి రక్షణ అందించడంలో సహాయ పడతాయి.
గ్రాండ్ విటారా CNG డిజైన్ దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ ని పోలి ఉన్నప్పటికీ ఇందులో CNG బ్యాడ్జ్ వంటివి చూడవచ్చు. ఇందులో ఎటువంటి అప్డేటెడ్ కాస్మెటిక్ చేంజస్ లేదు. కావున ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉంటుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా CNG ధరలు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ. అయితే ఉత్తమైన మైలేజ్ అందిస్తాయి. ఈ గ్రాండ్ విటారా CNG కొనాలనుకునే వారి కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికమైన కథనాలను తెలుసుకోవడంతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








