Tata Ace EV డెలివరీలు మొదలైపోయాయ్.. ధర ఎంతో తెలుసా?

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ గత ఏడాది దేశీయ మార్కెట్లో తన 'టాటా ఏస్ ఈవీ' (Tata Ace EV) కమర్షియల్ వెహికల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త సంవత్సరంలో వాటి డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

కంపెనీ విడుదల చేసిన ఈ ఆధునిక Ace EV వాహనాల ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). నిజానికి టాటా మోటార్స్ తొలిసారిగా 2005 లో ఏస్ వాణిజ్య వాహనాన్ని ప్రవేశపెట్టింది. చిన్న తరహా వ్యాపారస్థులు మరియు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వాణిజ్య వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఈ ఆధునిక కాలంలో తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Tata Ace EV డెలివరీలు మొదలైపోయాయ్..

టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ కంపెనీ యొక్క ఇవోజెన్ ఈవీ (Evogen EV) పవర్‌ట్రెయిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పవర్‌ట్రైన్ సెటప్‌లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్ మరియు 130 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ట్రక్కులో అమర్చిన లిక్విడ్-కూల్డ్ IP67 సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో పనిచేస్తుంది.

కంపెనీ అందించిన ఈ బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ చార్జ్ పై గరిష్టంగా 154 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే ఈ పరిధి వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ తమ ఏస్ ఈవీని ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు మరియు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త Ace EVని సరఫరా చేసేందుకు గానూ, కంపెనీ ఇప్పటికే కొన్ని అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

టాటా మోటార్స్ తమ సరికొత్త టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలను అమెజాన్ (Amazon), బిగ్‌బాస్కెట్ (BigBasket), సిటీ లింక్ (City Link), డాట్ (DOT), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), లెట్స్ ట్రాన్స్‌పోర్ట్ (Lets Transport), మూవింగ్ (MoEVing) మరియు యెల్లో ఈవీ (Yelo EV) వంటి కంపెనీ లకు మొదట డెలివరీ చేస్తుంది. కావున ఇ-కామర్స్ దిగ్గజాలు ఈ వాహనాలను త్వరలో రోడ్డు మీద తిప్పనున్నాయి.

కొత్త టాటా ఏస్ ఈవీ 3,800 మిమీ పొడవును, 1,500 మిమీ వెడల్పును మరియు 2,635 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. టాటా ఏస్ ఈవీ యొక్క వీల్‌బేస్ 2,100 మిమీగా ఉంటుంది మరియు దీని టర్నింగ్ రేడియస్ 4.3 మీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం మొత్తం బరువు 1,840 కేజీలు కాగా, ఇది 600 కేజీల వరకూ పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

అదే సమయంలో టాటా ఏస్ ఈవీ యొక్క లోడ్ బాడీ 2,163 మిమీ పొడవు, 1,475 మిమీ వెడల్పు మరియు 1,847 మిమీ ఎత్తును కలిగి ఉండి 208 క్యూబిక్ అడుగుల లోడింగ్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది చిన్నపాటి కార్గో అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. టాటా ఏస్ ఈవీ టైర్లను గమనిస్తే, నాలుగు చక్రాలపై 155 R13 LT 8PR ప్రొఫైల్‌ టైర్లకు 13 ఇంచ్ స్టీల్ వీల్స్ అమర్చబడి ఉంటాయి.

ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు మరియు బైకులు వంటివి మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు కమర్షియల్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ లో రావడం అనేది రవాణాలో విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు మరిన్ని ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2023, 8:11 [IST]
English summary
New tata ace ev delivery begin details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+