Bharat NCAP: భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా హారియర్, సఫారీ SUVలకు 5 స్టార్ రేటింగ్
భారత్‌లో తొలిసారిగా తీసుకువచ్చిన భారత్ NCAP(Bharat New Car Assessment Program) ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. గ్లోబల్ NCAP మాదిరిగానే భారత్ NCAP ద్వారా కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో Bharat NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడిన మొదటి కార్లుగా టాటా హారియర్ మరియు సఫారీ నిలవడంతో పాటు 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి.
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి ఇటీవల విడుదలైన టాటా హారియర్, సఫారీ SUVలు భారత్ NCAP నిర్వహించిన సేఫ్టీ టెస్ట్‌లో అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. భారత్ NCAP ద్వారా సైడ్ ఇంపాక్ట్, ఫ్రంటల్ ఇంపాక్ట్, పోల్ సైడ్ ఇంపాక్ట్ సహా వివిధ పరీక్షలను నిర్వహించారు.

టాటా హారియర్(Tata Harrier Facelift), సఫారీ(Tata Safari Facelift) కార్లు, అడల్ట్ సేఫ్టీ(పెద్దల రక్షణ) విభాగంలో 32కి 30.08 స్కోర్ సాధించింది. ఛైల్డ్ ప్రొటెక్షన్(పిల్లల రక్షణ) విభాగంలో 49కి 44.54 స్కోర్‌ను సంపాదించింది. కాగా గతంలో గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లోనూ టాటా హారియర్, సఫారీ SUVలు 5-స్టార్ రేటింగ్‌ను సాధించి బెస్ట్ కార్లుగా నిలిచాయి.

టాటా హారియర్, సఫారీ కార్లు.. వయోజన రక్షణ విభాగంలో కనీసం 27 పాయింట్లు సాధించగా.. పిల్లల రక్షణ విభాగంలో 41 పాయింట్లు స్కోర్ చేసింది. దీని ద్వారా ఈ రెండు కార్లు భారత్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. కాగా 5-స్టార్ రేటింగ్‌ను పొందాలంటే.. ఈ కార్లు తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ మరియు రియర్ సీట్లలో సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో సహా వివిధ భద్రతా లక్షణాలను కలిగి ఉండటం తప్పనిసరి.
టాటా హారియర్, సఫారీ కార్లలో టాటా మోటార్స్ అనేక భద్రతా ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ SUVలలో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ అసిస్ట్, రెండవ వరుస ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అనేక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

భారత మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ రూ.15.49 లక్షల నుండి రూ.26.44 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 70 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 - స్వీడన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

హారియర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు గ్రిల్ మరియు స్ప్లిట్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, LED యాంబియంట్ లైటింగ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను చూడవచ్చు.
ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ SUVల ప్రారంభ ధర రూ.16.19 లక్షలుగా ఉంది. కస్టమర్లు కొనుగోలు చేసేందుకు టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్ మరియు 7 రంగు ఎంపికలతో సహా 10 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది. 16.30 కి.మీ మైలేజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








