'మారుతి ఎర్టిగా'ను పోలిన టయోటా రూమియన్ ఆవిష్కరణ..ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త ఎమ్‌పీవీని ఆవిష్కరించింది. ఈ కొత్త టయోటా ఎమ్‌పీవీ రూమియన్ త్వరలో విడుదల కానుంది. కాగా ఇది ప్రముఖ బ్రాండ్ మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీకి రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా వస్తుంది.
మారుతీ సుజుకి ఎర్టిగా మోడల్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న MPVలలో ఒకటి. దీనికి రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా టయోటా రూమియన్ రానుంది. ప్రస్తుతానికి, ఈ కొత్త Toyota Rumion MPV ధర, బుకింగ్ వివరాలను కంపెనీ ప్రకటించలేదు. టయోటా రూమియన్ 3 సంవత్సరాలు/1,00,000 కి.మీల ప్రామాణిక వారంటీతో విక్రయించనుంది. అయితే టయోటా ఇప్పటికే కొన్ని విదేశీ మార్కెట్లలో రూమియాన్‌ను విక్రయిస్తోంది.

కాగా టయోటా సంస్థ రూమియన్‌కు కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేసింది. ఇందులో ఇన్నోవాను ఆధారంగా చేసుకుని దాని విభిన్న గ్రిల్‌ను రూమియన్‌లో పొందుపరిచింది. ఇంకా ముందు బంపర్ కూడా భిన్నంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ కోసం క్రోమ్ సరౌండ్‌ను కలిగి ఉంది. ఈ కారు రెండు వైపులా టోన్ మెషిన్డ్ ఫినిషింగ్‌లో పూర్తి చేసిన విభిన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులో 7-సీట్ల కాన్ఫిగరేషన్‌ను ఎర్టిగా నుంచి తీసుకున్నారు.
ఇంకా కొత్త టయోటా రూమియన్ పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రెయిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టయోటా రూమియన్ 1.5 లీటర్, నాలుగు సిలిండర్, నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 6,000 RPM వద్ద 101 BHP పవర్ మరియు 4,400 RPM వద్ద 136.8 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

CNG వేరియంట్లో ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 86.63 bhp శక్తిని మరియు 121.5 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటాయి. ఇంకా పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది. దీని పెట్రోల్ వెర్షన్ 20.51 kmpl మైలేజ్ అందిస్తుంది. CNG వెర్షన్ 26.11 kg/km మైలేజ్ ఇస్తుంది.
కొత్త టొయోటా రూమియన్ S MT/AT, G MT, V MT/AT మరియు S MT CNG వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ టయోటా రూమియన్ కారు ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే మారుతి సుజుకి ఎర్టిగా కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ప్రస్తుత ప్రారంభ ధర రూ.8.64 లక్షల( ఎక్స్-షోరూమ్).

టయోటా మోటార్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అతుల్ సూద్ రూమియన్ ఆవిష్కరణపై మాట్లాడారు. కొత్త టయోటా రూమియన్ పరిచయం టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు గొప్ప ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. టయోటా రూమియన్ అసాధారణమైన, కాంపాక్ట్ MPV గా పేర్కొన్నారు.
ఈ MPV విశాలమైన క్యాబిన్‌తో పాటు సౌకర్యం, అద్భుతమైన ఇంధన సామర్థ్యం, స్టైలిష్ మరియు ప్రీమియం ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో కొత్త ప్రమాణాలను సెట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. తమ MPV వారసత్వంపై చాలా నమ్మకం ఉందని.. క్రిస్టా, హైక్రాస్, వెల్‌ఫైర్ మార్కెట్లో విజయం సాధించాయన్నారు.

మార్కెట్లోకి కొత్త కారును విడుదల చేసినప్పుడు ఎటువంటి లక్ష్యాలను సెట్ చేసుకోబోమని చెప్పారు. టయోటా ప్రీ-సేల్స్ అనుభవంతో కస్టమర్‌లకు పారదర్శకమైన సర్వీసును అందించడమే లక్ష్యమని చెప్పారు. ముందుగా కారు బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా డెలివరీ చేస్తామని.. దానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications








