మార్కెట్లో విడుదలైన రెండు సరికొత్త టయోటా వెల్‌ఫైర్ ఎంపీవీలు.. ధర, ఫీచర్లు ఇవే..!!
ఇండియన్ ఫోర్ వీలర్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు వచ్చేసింది. ప్రముఖ వాహన తయారీదారు టయోటా నుంచి అప్‌డేటెడ్ లగ్జరీ ఎంపీవీ వెల్‌ఫైర్(Toyota Vellfire) విడుదల అయ్యింది. హై స్పెసిఫికేషన్స్‌తో రెండు వేరియంట్లలో ఈ కారు రిలీజైంది. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, పూర్తి వివరాలను ఈ కథనంలో చదవండి.
టయోటా తన నెక్స్ట్ జెన్ వెల్‌ఫైర్(Toyota Vellfire) ఎమ్‌పీవీని దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.20 కోట్లుగా ఉంది. ఈ కారును మరింత విలాసవంతంగా అధునాతన ఫీచర్లతో ప్రవేశపెట్టింది. కాగా కొత్త వెల్‌ఫైర్‌ను టయోటా రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. హాయ్(Hi) మరియు వీఐపీ(VIP). ఇక్కడ వీఐపీ వేరియంట్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో వస్తుంది.

అయితే టయోటా వెల్‌ఫైర్‌ను ఊహించిన దాని కంటే ముందుగానే దేశీయ మార్క్‌ట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల అవుతుందని భావించారు. కాగా ఇప్పటికే జూన్‌లో, కొంతమంది టయోటా డీలర్లు టయోటా వెల్‌ఫైర్‌ను కొనుగోలు చేసేందుకు అనధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇక కొత్త టయోటా వెల్‌ఫైర్ డిజైన్‌ను పరిశీలిస్తే ఇది అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే అదే రూపాన్ని కలిగి ఉంది. టయోటా లోగో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లతో కవర్ చేయబడిన భారీ సిక్స్-స్లాట్ గ్రిల్‌లో సెంటర్ స్టేజ్‌ను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. U ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ బంపర్‌పై ఉంటుంది.
ఫీచర్లు: అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త వెల్‌ఫైర్ లిమిటెడ్ బటన్‌లతో సింపుల్‌గా ఉండే డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. దీనికి కారణం మెజారిటీ ఫంక్షన్‌లను ఇప్పుడు పెద్ద, 14-అంగుళాల టచ్‌స్క్రీన్‌లో చూడవచ్చు. సౌకర్యవంతంగా ఉండే సీట్ డిజైన్, ప్రయాణీకుల కోసం పెద్ద ఓవర్ హెడ్ కన్సోల్, బహుళ AC వెంట్లు, అంతేకాకుండా కొత్తగా రూపొందించిన పుల్ డౌన్ సన్ షేడ్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఇక వెల్‌ఫైర్‌లో టాప్ ఎండ్ మోడల్ VIPలో ట్రిమ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో వస్తుంది. హీటింగ్, వెంటిలేషన్‌తో పాటు ముడుచుకునే టేబుల్‌లతో రెండవ వరుసలో రెండు కెప్టెన్ కుర్చీలతో వస్తుంది. ఇంకా కొత్త డిటాచబుల్ కంట్రోల్ ప్యానెల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, రెండవ వరుస సీట్ల కోసం ఒట్టోమన్ ఇలా 60కి పైగా ఫీచర్లను టయోటా ఈ లగ్జరీ కారులో ప్రవేశపెట్టింది.
సేఫ్టీ ఫీచర్లు: కొత్త వెల్‌ఫైర్ ఎంపీవీలో టయోటా సేఫ్టీ సెన్స్ ADAS సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రీ-కొలిజన్ సేఫ్టీ సిస్టమ్, లేన్ ట్రేస్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్‌ను కలిగి ఉంది. ఇంకా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, పార్క్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఇలా అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
కొత్త వెల్‌ఫైర్ ఇంజిన్ పనితీరును చూసుకుంటే ఇది 193 hp వద్ద 240 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.5 లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో e-CVTతో జతచేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ పరంగా చూసుకుంటే 19.28kpl మైలేజ్‌ని ఇస్తుంది.
కొత్త టయోటా వెల్‌ఫైర్ ఇది 4,995mm పొడవు, 1,850mm వెడల్పు మరియు 1,950mm ఎత్తుతో పాటు 3,000mm వీల్‌బేస్‌తో రూపుదిద్దుకుంది. అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే, వెడల్పు మరియు వీల్‌బేస్ అలాగే ఉన్నాయి. పొడవు మరియు ఎత్తు వరుసగా 60mm మరియు 50mm గా ఉంది.
ధర: ఇక ధర విషయానికొస్తే కొత్త టయోటా వెల్‌ఫైర్ హాయ్(Hi) వేరియంట్ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 1.20 కోట్లుగా ఉంది. ఇక టాప్ స్పెక్ వీఐపీ(VIP) వేరియంట్ ధర రూ.1.30 కోట్లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. లెక్సస్ దేశీయ మార్కెట్‌లో LM MPVని లాంచ్ చేసే వరకు, వెల్‌ఫైర్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేకుండా లగ్జరీ MPVగా కొనసాగుతుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








