Volvo C40 Recharge EV వోల్వో నుంచి 530 కి.మీ రేంజ్‌తో సరికొత్త సీ40 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ

స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో తన కొత్త వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త వోల్వో సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు ధరను ఈ ఏడాది ఆగస్టు నెలలో వెల్లడించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు CMA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని వోల్వో తెలిపింది. స్వీడిష్ కార్ల తయారీదారు మరియు దాని చైనీస్ మాతృ సంస్థ గీలీ ఎలక్ట్రిక్ కార్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. దేశంలో C40 రీఛార్జ్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌లో వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో కొత్త సంచలనం సృష్టించేందుకు సమాయత్తమైంది.

Volvo C40 Recharge EV

కొత్త వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో 78kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారు డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో 405 bhp వద్ద 660 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ వోల్వో ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే 530 కి.మీల వరకు సునాయాసంగా ప్రయాణించవచ్చు.

కొత్త వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్ కారు 150 kw DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 27 నిమిషాల్లో బ్యాటరీ ప్యాక్‌ను 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ కారు 4.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

Volvo C40 Recharge EV

కొత్త వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు డిజైన్ విషయానికొస్తే కారు డిజైన్ వోల్వో దాని థోర్స్ హామర్ హెడ్‌లైట్‌లతో ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే బానెట్ కింద సైలెంట్ పవర్‌ట్రెయిన్ (ఎలక్ట్రిక్)ని బహిర్గతం చేయడానికి గ్రిల్ కవర్‌తో వస్తుంది. కారు యొక్క ట్విన్ మినీ స్పాయిలర్‌ల మాదిరిగానే రూఫ్ రైల్ డిజైన్‌కు కొంత స్పోర్టినెస్‌ లుక్‌ని జోడించింది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రూఫ్‌లో రేక్డ్ రియర్ విండ్‌స్క్రీన్ మరియు కిటికీలో స్పాయిలర్‌తో ముగుస్తుంది. అంతే కాకుండా 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఈ కొత్త వోల్వో ఎలక్ట్రిక్ కారు ఫీచర్లను చూసుకుంటే ఈ కారులో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ బేస్‌డ్‌ గూగుల్ సాఫ్ట్‌వేర్ సెటప్‌తో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో ఆకర్షణీయంగా నిలిచింది.

Volvo C40 Recharge EV

దీంతో పాటుగా, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ అయి వచ్చింది. అంతేకాకుండా ఆపిల్ కార్‌ప్లేకి కూడా ఈ ఈవీ సపోర్ట్ చేస్తుంది. వోల్వో C40 రీఛార్జ్‌ను రెండు అంతర్గత థీమ్‌లను కలిగి ఉంది. కలర్స్‌ విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ కారు సిరస్ వైట్, ఒనిక్స్ బ్లాక్, ఫ్యూజన్ రెడ్, క్లౌడ్ బ్లూ, ఫ్జోర్డ్ బ్లూ మరియు సేజ్ గ్రీన్ ఇలా ఆరు రంగుల ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త వోల్వో C40 లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. భద్రత కోసం కారులో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు సీట్లకు విప్లాష్ రక్షణ, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ యాంగిల్‌ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఇలా అధునాతన ADAS ఫీచర్లతో సహా భద్రతా సాంకేతికత ఫీచర్లతో ఈ కారు డిజైన్‌ చేయబడిందని కంపెనీ వివరించింది.

Volvo C40 Recharge EV

More from DriveSpark

Article Published On: Wednesday, June 14, 2023, 13:56 [IST]
English summary
New volvo c40 recharge revealed in indian markets range and specification details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+