దీపావళి ముగిసినా ఈ బ్రాండ్ కార్లపై ఇంకా కొనసాగుతున్న ఆఫర్లు.. వెంటనే కొనుగోలు చేయండి.!!
భారత మార్కెట్లో పండుగ సీజన్ వచ్చిందంటే.. కొత్త వాహనాల కొనుగోలుకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా కార్ల కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు ఆకర్షిస్తాయి. ప్రతి యేటా ఇది సాంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్ కూడా ఆటో మేకర్లకు మంచి సేల్స్‌నే ఇచ్చింది.
కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కూడా ఎక్కువగా పండుగ సీజన్లలోనే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కార్ల కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఏ ఏడాది ప్రముఖ కంపెనీలు సైతం పోటాపోటీగా ఆఫర్లను ప్రవేశపెట్టడంతో ఆటో మొబైల్ రంగం ఊపందుకుంది.

గత నెల అక్టోబర్, ఈ నవంబర్‌లో వరుసగా దసరా, ధన్ తేరాస్, దీపావళి వరుస పండుగలతో కస్టమర్లకు బంపర్ ఆఫర్లను కార్ల తయారీదారులు ప్రకటించారు. దీంతో పలు కార్ల కంపెనీలు మంచి సేల్స్‌ను సంపాదించుకున్నాయి. కాగా ఇప్పుడు మరి పండుగ సీజన్ ముగిసింది. ఆఫర్లు అయిపోయాయి. మరి మిగిలిన ఈ కొద్ది రోజులు ఇదే ఉత్సాహం కొనసాగనుందా..
ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పండుగ సీజన్ ముగిసినా కొన్ని కార్లపై ఇంకా పలు సంస్థలు ఆఫర్లను కొనసాగిస్తూనే ఉన్నాయి. కొత్త కారు కొనాలనుకునేవారు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంతకీ ఏయే కార్లపై ఆఫర్లు కొనసాగుతున్నాయి.. పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

మాస్ మార్కెట్, లగ్జరీ కార్ మార్కెట్లో ఆటో కంపెనీలు ఇప్పటికే ఉన్న పలు మోడళ్లకు అప్‌డేట్లను ప్రవేశపెట్టాయి. వీటికీ పండుగ సీజన్‌లో మంచి సేల్స్‌ను నమోదు చేసుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(SIAM) నివేదించిన గణాంకాల ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 3.89 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.
కాగా ఈ ఏడాది నవంబర్‌లో ఇదే తరహాలో ఆశాజనక సేల్స్ నమోదయ్యే అవకాశాలున్నాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు. కొత్త కార్ల కొనుగోళ్లు పెరగడంతో సరఫరా, ఉత్పత్తిపై డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో డెలివరీ టైమ్‌లైన్ కూడా పెరగడంతో.. ఆఫర్లు, డీల్స్ కూడా కొనసాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఈ క్రమంలో పండుగ సీజన్ ముగిశాక కార్ల ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో కార్ల కంపెనీలకు సంబంధించి పలు బ్రాండ్లకు సంబంధించిన కొన్ని కార్ల యూనిట్లు మిగిలిపోయాయి. వీటిని క్లియర్ చేసేందుకు డీలర్లు వీటిపై ఆఫర్లను కొనసాగించే అవకాశం ఉంది. ఇవి కొత్త కార్లు కాకపోయినా ఏడాదికి ముందుగా వచ్చిన కార్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
కాగా మార్కెట్లో ప్రముఖ కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ నుంచి వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, హోండా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్లపై ఇప్పటికీ కొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో, సెలెరియో, స్విఫ్ట్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ నుంచి గ్రాండ్ ఐ10 నియోస్, అల్కాజర్ కార్లపై ఆఫర్ కొనసాగుతోంది. టాటా మోటార్స్ నుంచి టియాగో, టిగోర్ కార్లపై ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. హెక్టార్, ఎంజీ కామెట్, ఇంకా ఇతర కార్లపై ఆకర్షణీయమైన కార్లు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








