దేశంలోనే భారీ రికార్డ్..! గంటకు 358 కి.మీ వేగంతో ప్రయాణించే కారు..
మహీంద్రా యాజమాన్యంలోని ఇటాలియన్ ఎలక్ట్రిక్ కారు పినిన్ ఫరినా బట్టిస్టా భారతదేశంలోని నాట్రాక్స్ టెస్ట్ ఫెసిలిటీలో అత్యధిక స్పీడ్ ను చేరుకుని రికార్డు బద్దలు కొట్టింది. క్వార్టర్-మైలు (¼) దూరాన్ని కేవలం 8.55 సెకన్లలో, హాఫ్-మైలు(1/2) ను 13.38 సెకన్లలో పూర్తి చేసి మనుపటి రికార్డును చెరిపివేసింది.
భారతీయ రోడ్డుపై గంటకు 358 కి.మీ వేగంతో ప్రయాణించి ఈ కారు సరికొత్త రికార్డును నమోదు చేసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వద్ద నేషనల్ ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్స్ వద్ద ఈ రైడ్ టెస్ట్ జరిగింది. మిచెలిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 టైర్లు అమర్చి ఈ టాప్ స్పీడ్ టెస్ట్ నిర్వహించారు.

358 కి.మీ వేగంతో..
ఈ టెస్ట్‌లో, ట్రాక్ పై 358.03 కి.మీ వేగాన్ని కారు నమోదు చేసింది. గతంలో దీని టాప్ స్పీడ్ 332 కి.మీ గా ఉంది. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. ఈ విషయాన్ని FIA (ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్ నేషనల్ ఆటోమొబైల్స్)తో అనుబంధంగా ఉన్న భారత గవర్నింగ్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) ధృవీకరించింది. ఈ ఈవెంట్ ను VBOX ఆధారంగా చిత్రీకరించారు.
పినిన్ ఫరినా బట్టిస్టా 1,900hp పవర్ మరియు 2,340Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే ఒక హైపర్ EV. అంతే కాకుండా ఇది 1.79 సెకన్లలో 0-60 mph (96kph), 1.89 సెకన్లలో 0-100 kmph, 4.49 సెకన్లలో 0-120 mph మరియు 4.75 సెకన్లలో 0-200 kmph వరకు వేగవంతం అవుతుంది. 120kWh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్ నుంచి ఈ కారు శక్తిని పొందుతుంది. మొత్తం మీద ఇది ప్రపంచంలో వేగవంతమైన EVగా రికార్డు బద్దలు కొట్టింది.

ప్రపంచంలోనే ఏకైక ఎలక్ట్రిక్ కారు
స్పీడింగ్ కారు బట్టిస్టా ఇలా రికార్డులు నమోదు చేయండం తొలిసారి ఏమీ కాదు. ఇది వరకే 0-100km/h వేగాన్ని కేవలం 1.86 సెకన్లలో చేధించింది. ఈ ఇటాలియన్ హైపర్-GT కేవలం 4.75 సెకన్లలో 0-200km/h చేరుకుని రికార్డు సృష్టించింది. కేవలం 31 మీటర్లను గంటకు100-0 వేగంతో దూసుకుపోతున్న ప్రపంచంలోనే ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.
భారతీయ రోడ్లపై పినిన్ ఫరినా సత్తా చాటడం శుభసూచకం అని ఆ సంస్థ CEO పాలో డెల్లాచా వెల్లడించారు. మా వాటాదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్‌తో ఆధ్వర్యంలో భారతదేశంలో ఈ స్పీడ్ కార్లకు డిమాండ్ పెరగనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రోడ్డు, ట్రాక్ లో ప్రతి డ్రైవర్ రైడ్ ను ఎంజాయ్ చేసేలా బట్టిస్టా మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు.

ఈ మోటర్ షోలో ప్రదర్శన..
ఈ కారును హైదరాబాద్ లో జరిగిన ఈ-మోటర్ షోలో దీనిని ప్రదర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ లో ఈ కారు ప్రత్యేకంగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు ఈ స్పోర్ట్స్ కారులో ప్రయాణించారు. హైదరాబాద్ పుర వీధుల్లో దాదాపు 2.83 కి.మీ వరకు మాస్టర్ బ్లాస్టర్ ప్రయాణించారు. రానున్న రోజుల్లో ఈ స్పోర్ట్స్ కారుకు భారీ డిమాండ్ పెరగనుంది.
భారత్ లో స్పోర్టింగ్ కార్ల కోసం V8 ఇంజిన్ కార్లు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ మోటార్‌స్పోర్ట్ ఫార్ములా-E రాకతో భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు సిరీసులపై ఆసక్తిని పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ తో ఉన్న ఈ కారు ధర భారత్ లో సుమారు రూ.19 కోట్లుగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








