కారులో మినీ కిచెన్ ఎప్పుడైనా చూశారా.. జర్నీలో హాయిగా మీకు నచ్చింది వండుకొని తినొచ్చు.. ఇంకా ఎన్నో ఫీచర్లు..

మీరు ఏదైనా కారులో లాంగ్ జర్నీకి వెళ్లినప్పుడు మధ్యలో ఆకలేస్తే ఎక్కడైనా ఆగి హోటల్లో తింటాం. లేదంటే ఇంటి నుంచే ఏవైనా తినడానికి తీసుకెళ్తాం. కానీ కారులో వంట సామగ్రికి సరిపడా అన్ని సౌకర్యాలు ఉంటే ఎగిరి గంతేస్తారు కదా.. అలాంటి కారు గురించే ఇక్కడ మీకు చెప్పబోతున్నాం.

చైనాకు చెందిన పోల్‌స్టోన్స్ ఆటోమొబైల్స్ తన మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది స్టార్టప్ ఆటోమొబైల్ తయారీ కంపెనీ. పోల్‌స్టోన్స్ దీనిని ఆకర్షణీయమైన మరియు విలాసవంతమైన వాహనంగా మార్చింది. అది Polestones 01 SUV.. ఈ కారును ఇటలీకి చెందిన పినిన్‌ఫారినా రూపొందించారు. ఇదే ఈ కారును మల్టీ ఫీచర్ కారుగా మార్చింది.

Polestones-01-Kitchen

మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు వండుకుని తినేందుకు వీలుగా మినీ కిచన్‌తో ఈ కారును తయారు చేశారు. ఇది కాకుండా, ఈ కారులో 4X4 సౌకర్యం కూడా అందించారు. అందువల్ల, ఈ కారు ఎలాంటి రహదారిపై ఐనా కూడా సులభంగా ప్రయాణించగలదు. ముఖ్యంగా ఈ కారు కఠినమైన జంగిల్ ట్రైల్స్‌లో కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది.

ఈ ఫీచర్లతో పాటు ఇందులో లెవెల్ 2 అటానమస్ టెక్నాలజీ కూడా అందించారు. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ మోటార్ 469 హెచ్‌పి పవర్ వద్ద 740 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 250 కి.మీ కంటే ఎక్కువ అని కంపెనీ పేర్కొంది.

Polestones-01-Kitchen

అంతే కాకుండా ఈ కారు కేవలం 5.5 సెకన్లలో సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని వెల్లడించింది. ఇది మాత్రమే కాదు, చైనా కంపెనీ ఈ కారులో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందించింది. ఇందులో 56 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 235 కి.మీల దూరం ప్రయాణించవచ్చు.

కాబట్టి, ఈ కారును పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రెండింటిలోనూ నడపవచ్చు. ఈ సూపర్ ఫీచర్లతో పాటు, పోల్‌స్టోన్స్ ఈ కారులో వంటగది సౌకర్యాలను కూడా అందించింది. ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా ఉండే వంటగది, కుక్కర్, నీటిని పంపిణీ చేయడానికి చిన్న ట్యాంక్ మరియు పాత్రలు కడగడానికి మరియు నిల్వ చేయడానికి స్థలంతో కారును అద్భుతంగా తీర్చిదిద్దారు.

Polestones-01-Kitchen

దీంతో కారులో మీరు ఇంట్లో మాదిరిగా వండుకుని తినొచ్చు. ఈ కారులో అటువంటి ఫీచర్లు అందించడంతో, క్యాంపింగ్ మరియు అడ్వెంచర్ ట్రిప్‌ల కోసం ఈ కారును విస్తృతంగా ఉపయోగించవచ్చని స్పష్టమైంది. అందుకు తగ్గట్టుగానే చిన్న టెంట్ ను కూడా ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని ఈ కారులో కల్పించారు. ఈ టెంట్‌ను ఏర్పాటు చేయడానికి కేవలం ఐదు నిమిషాలు సరిపోతుందని కంపెనీ స్పష్ట చేసింది.

Polestones-01-Kitchen

పోల్‌స్టోన్ 01 కారులో ఇలాంటి మరిన్ని ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ కారులో ఏడుగురు కూర్చోవచ్చు. అలాగే, కంపెనీ ఈ కారును ఆరు మరియు ఏడు సీట్ల ఎంపికలలో అందించబోతోంది. అయితే ధర వివరాలను మాత్రం ప్రకటించలేదు. ప్రత్యేకించి, ఏడు సీట్ల కారులో ముందు వరుస సీటు మినహా అన్ని సీట్లతో మడతపెట్టవచ్చు.

Polestones-01-Kitchen

దీని ద్వారా మీరు కారులో కింగ్ సైజ్ మ్యాట్రెస్‌ని తీసుకొచ్చినట్లే బెడ్‌ కంఫర్ట్‌ని పొందవచ్చు. వీటితో పాటు వినోదం కోసం ఈ కారు పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ కారులో పెట్రోల్ నింపి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 1,100 కి.మీ దూరం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 20:13 [IST]
English summary
Pininfarina designed built in kitchen and gazebo in polestones 01 car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+