Fiat Topolino EV ప్రపంచంలోనే చిన్న ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తెచ్చిన ఫియట్..!
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తయారీ సంస్థలు కూడా వివిధ రకాల వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ Fiat.. ప్రపంచంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. Fiat Topolino EV పొడవు 2.53 మీటర్లు మాత్రమే ఉంటుంది. MG Comet EV కంటే చిన్నగా ఉండనుంది.
ఫియట్ టోపోలినో కారు ముందస్తు బుకింగ్‌లు ఇటలీలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి తొలుత ఇటలీలోనే విక్రయాలు ప్రారంభించి.. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కారును అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. భారత కస్టమర్లకు ఈ కారు అందుబాటులో ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.

ఫియట్ టోపోలినో ఎలక్ట్రిక్ కారు పట్టణ వినియోగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేశారు. ఈ కారు కంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఈ వాహనం గరిష్ఠ వేగం 45 కి.మీ మాత్రమే. ఫియట్ సంస్థ తొలి ఎలక్ట్రిక్ 500e, టోపోలినో రెండో వాహనం, ఫియట్ టోపోలినో 5.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 75 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ కారును రెండు వేర్వేరు రూఫ్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సాధారణ మెటల్ రూఫ్ కాకుండా కాన్వాస్ రూఫ్ లేదా గ్లాస్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు డోర్లు నాన్ డోర్ ఎంపికతో లభిస్తాయి. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఇటువంటి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఫియట్ టోపోలినో కారు క్రోమ్ కోటింగ్‌తో కూడిన అద్దాలు, USB, బ్లూటూత్ స్పీకర్, ప్రీమియం సీట్ కవర్‌తో వస్తుంది. ఈ కారు ధర USD 8065. అదే భారత కరెన్సీలో అయితే రూ.6.70 లక్షలుగా ఉంది. ఇటలీలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఫియట్ సంస్థ EMI ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు USD 42 చొప్పున 48 నెలలపాటు చెల్లించేలా అవకాశం ఇచ్చింది.
ఆకర్షణీయమైన డిజైన్, ధర, EMI వంటి ఆప్షన్ల కారణంగా భారీగా ఫియట్ టోపోలినో ఎలక్ట్రిక్ కారు ఇటలీలో భారీగా కస్టమర్లను ఆకర్షించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ కారు వెయిటింగ్ పిరియడ్ 19 వారాల వరకు ఉంది. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. అయితే ఈ కారు కేవలం ఇటలీలోనే ప్రస్తుతం అందుబాటులో అంది. ఇతర దేశాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








