125 సంవత్సరాల వేడుక... నాలుగు కొత్త టైర్లను విడుదల చేసిన గుడ్‌ఇయర్‌

అమెరికాకు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ GoodYear ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ కోసం నాలుగు కొత్త టైర్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమంతో మలేషియాలో సంస్థ 125వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించింది. ఈ నాలుగు రకాల టైర్లు వేర్వేరు వాహనాల కోసం తయారుచేయబడ్డాయి.

ఈగల్‌ F1 టైర్లు స్పోర్ట్స్‌ కార్లు, లగ్జరీ వాహనాల కోసం, ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ టైర్లు.. ఎలక్ట్రానిక్‌ వాహనాల మార్కెట్‌ కోసం, Wrangler Duratec RT టైర్లు SUV, పికప్‌ ట్రక్కుల కోసం, అస్యూరెన్స్‌ మాక్స్‌గార్డ్‌ టైర్లు కాంపాక్ట్‌, మిడ్‌సైజ్‌, ఎంట్రీ స్థాయి వాహనాల కోసం తయారుచేయబడ్డాయి.

Goodyear launched four new tyres

గుడ్‌ఇయర్‌ సంస్థ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఎలక్ట్రిక్‌డ్రైవ్‌ టైర్లను తొలిసారిగా విడుదల చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా ఈ టైర్లు ఉంటాయని సంస్థ చెబుతోంది. సామర్థ్యం, మెరుగైన ట్రాక్షన్‌, నాయిస్‌ తగ్గింపు, రోలింగ్‌ రెసిస్టన్స్‌ను కలిగి ఉంటుందని గుడ్‌ఇయర్‌ సంస్థ పేర్కొంది.

గుడ్‌ ఇయర్‌ సంస్థ విడుదల చేసిన ఎలక్ట్రిక్‌డ్రైవ్‌ టైర్లు.. ఎలక్ట్రిక్‌ వాహనాల టార్క్‌ స్థాయిలకు ఎదుర్కొనేందుకు.. ETCR ఎలక్ట్రిక్‌ రేసింగ్‌ టైర్ నుంచి వెడల్పయిన రిబ్‌ డిజైన్‌, హైటెక్‌ క్యాప్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు పేటెంట్‌ సర్య్కూట్‌ బోర్డు నమూనాలకు కలిగి ఉంటుంది. ఇది తడి వాతావరణం కలిగిన రోడ్లపై మెరుగైన ట్రాక్షన్‌ను కలిగిస్తుంది.

Goodyear launched four new tyres

అలాగే గుడ్ఇయర్‌ అస్యూరెన్స్‌ మాక్స్‌గార్డ్‌ టైర్లు మెరుగైన గ్రిప్‌, ఇంపాక్ట్‌ ప్రొటెక్షన్‌ను అందిస్తాయని సంస్థ చెబుతోంది. వాటర్‌ వేవ్‌ షీల్డ్‌ ప్రొటెక్షన్‌ ప్యాట్రన్‌తో యాక్టివ్‌ గ్రిప్‌ టెక్‌ కారణంగా మెరుగైన గ్రిప్‌ను కలిగి ఉంటుంది. గుడ్‌ఇయర్‌ సంస్థ కొత్త మ్యాక్స్‌గార్డ్‌ టైర్లు తడి రోడ్లపై మెరుగైన ట్రాక్షన్‌ను అందిస్తాయని తెలిపింది.

కొత్తగా విడుదలైన అస్యూరెన్స్‌ మాక్స్‌గార్డ్‌ టైర్లు గుడ్‌ఇయర్‌ డ్యూరాగార్డ్‌ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఫలితంగా ఈ టైర్లు మరింత పటిష్ఠంగా ఉంటాయి. ఈ టైర్లు రెండు పొరలను కలిగి ఉంటాయి. అవి కార్కాస్‌ ఫ్లైతోపాటు అధిక సాంధ్రత, పటిష్ఠతను కలిగి ఉంటాయి. మరియు అధిక టెన్సైల్‌ స్టీల్‌ రెండు బెల్ట్‌లను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా వచ్చే కోతల నుంచి కాపాడతాయి.

Goodyear launched four new tyres

గుడ్‌ఇయర్‌ ఈగల్‌ F1 అసిమెట్రిక్‌ 6 టైర్లు.. వేగం, మెరుగైన పనితీరు కోసం చూస్తున్నవారికి ఉపయోగంగా ఉంటాయి. ఈ టైర్లు తడి, పొడి రోడ్లపై అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తాయి. తక్కువ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. అడాప్టివ్‌ కాంటాక్ట్‌ ప్యాచ్‌, ఆప్టిమైజ్‌ క్యావిటీ షేప్‌ కారణంగా, పొడి వాతావరణ పరిస్థితుల్లోను మైరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ టైర్లు మరింత మైక్రో కాంటాక్ట్‌, తడి లేదా పొడి రోడ్లపై మెరుగైన నియంత్రణను కల్పిస్తాయి.

కొత్త గుడ్‌ఇయర్‌ ఈగల్‌ F1 అసిమెట్రిక్ 6 టైర్లు తక్కువ శబ్దాలను విడుదల చేస్తాయి. సెంట్రల్ రిబ్స్‌, డిజైన్‌ పాటు రేడియల్‌ చాంపెర్ట్‌ గ్రోవ్‌ దీనికి సహాయపడతాయి. దీంతోపాటు గుడ్‌ఇయర్‌ Wrangler Duratec RT టైర్లు.. ట్రై షీల్డ్‌ టెక్‌ సైడ్‌వాల్‌ బలాన్ని పెంచుతుంది.

Goodyear launched four new tyres

3 ప్లై సైడ్‌వాల్‌ నిర్మాణం ద్వారా చొచ్చుకుపోకుండా చూస్తుంది. ఈ టైర్లు పరిస్థితులతో సంబంధం లేకుండా మెరుగైన ట్రాక్షన్‌ కంట్రోల్‌ను అందిస్తుంది. ఇందులో ఉపయోగించిన డ్యూరాఎడ్జ్‌ టెక్‌ షార్ప్‌ డిజైన్‌తో వస్తుంది. ఆఫ్‌రోడ్‌ ప్రమాదాల బారి నుంచి అధిక రక్షణను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 12, 2023, 10:45 [IST]
English summary
Popular brand goodyear launched four new tyres on 125th anniversary
Read more on: #టైర్లు #tyres
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+