కార్లకు క్రాష్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు.??.. భారత్ NCAP విధివిధానాలు ఎలా ఉంటాయో తెలుసా.??
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(భారత్ NCAP)ను సుదీర్ఘ నిరీక్షణ మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు. భారత్ NCAP లోగో, స్కిక్కర్‌ను ఆవిష్కరించారు. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో కార్ల తయారీదారులు క్రాష్ టెస్ట్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
భారత్ NCAP లో కార్లను ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ స్టాండర్డ్ AIS 197 ప్రకారం పరీక్షిస్తారు. కారులో ప్రయాణీకులు ఎంత సురక్షితంగా ఉంటారో తెలుసుకోవడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయి. భారత్ NCAP నిర్వహించి క్రాష్ టెస్టులో కార్ల పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. దీని ద్వారా కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు సురక్షితమైన కారును ఎంచుకునే అవకాశం ఉంటుంది.

అయితే భారతదేశంలో విక్రయించే కార్లకు భారత్ NCAP తప్పనిసరి కాదు. కార్ల తయారీదారులు కోరుకుంటే, ఈ పరీక్షను AIS 197 నియంత్రణలో చేయవచ్చు. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP- పెద్దల భద్రత), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP- పిల్లల భద్రత) కు ఎలాంటి ప్రమాణాలు పాటించారనేది ఈ క్రాష్ టెస్టులో పరీక్షిస్తారు. ఇది గరిష్ఠంగా 3.5 టన్నుల బరువున్న వాహనాలను 8 సీట్ల వరకు పరీక్షించగలదు.
గ్లోబల్ NCAP ద్వారా పరీక్షించిన వాహనాలకు గరిష్ఠంగా 5 స్టార్స్ ఇస్తారు. ఇంకా వయోజన పరీక్ష పాయింట్‌లో మొత్తం 34 పాయింట్లు ఇవ్వబడతాయి. వీటిలో ఫ్రంటల్ తాకిడి వల్ల కలిగే ప్రభావాలను బట్టి 16 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ డ్యామేజ్‌కు 16 పాయింట్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లకు కూడా 2 పాయింట్లు ఇవ్వబడతాయి.

కారుకు క్రాష్ టెస్ట్ పూర్తయిన అనంతరం, 5 స్టార్లను పొందాలంటే, పెద్దల భద్రత స్కోర్‌పై కనీసం 27 పాయింట్లు మరియు పిల్లల భద్రత స్కోర్‌పై కనీసం 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలా పాయింట్లు సాధించిన సందర్భంలో మాత్రమే 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడుతుంది.
భారత్ NCAP పరీక్ష సమయంలో మొత్తం మూడు రకాల క్రాష్ టెస్ట్‌లు కారుకు నిర్వహిస్తారు. వాటిలో ఫ్రంట్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, సెకండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ అంటే సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, మూడవది ఇంపాక్ట్ ట్రస్ట్ అంటే పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్షలో పాల్గొనే వాహనాల్లో తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు మెరుగైన ఎమర్జెన్సీ బ్యాకింగ్ సిస్టమ్‌తో ప్రయాణీకుల కోసం త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్టార్ రేటింగ్ మరియు పాయింట్లు ఇస్తారు.
ఈ భారత్ NCAP పరీక్ష సమయంలో, కారు గరిష్ఠంగా 64 kmph వేగంతో ఫ్రంట్-ఎండ్ ఢీకొనేలా చేస్తారు. గ్లోబల్ NCAP సిస్టమ్‌లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తారు. సైడ్ క్రాష్ టెస్ట్ 50 kmph మరియు 29 kmph వేగంతో జరుగుతుంది.

భారత్ NCAP పరీక్షలో, పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా, CNG మరియు EV కార్లకు కూడా త్వరలో పాల్గొననున్నాయి. పెద్దల భద్రత మరియు పిల్లల భద్రతతో సహా భారత్ NCAPలో మొత్తం క్రాష్ టెస్ట్ ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా, కస్టమర్లు సురక్షితమైన కార్లను ఎంచుకోవచ్చు. భారత్ NCAP పరీక్ష ఆగస్టు 22 న ప్రవేశపెట్టిప్పటికీ, విధానం అక్టోబర్ 1 నుంచి మాత్రమే అమలులోకి రానుంది.
కాగా దేశంలోని కార్ల తయారీదారులు తమ కార్లను ఈ టెస్ట్ మోడ్‌లో పరీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే భారత్ ఎన్‌క్యాప్‌ను పలు ఆటో కంపెనీలు స్వాగతించాయి. ఈ భారత్ NCAP పరీక్షలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు కార్ల తయారీదారులు 30 కార్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 1 తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అయితే ఇప్పటి వరకు, ఆటో మేకర్లు కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహించాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేంది. ఈ క్రాష్ టెస్ట్ సెంటర్లు ప్రపంచంలో నాలుగు చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, కార్ క్రాష్ టెస్ట్‌లను నిర్వహించే సౌకర్యాలు ఉన్న ఐదవ ప్రదేశం భారతదేశం. భారతీయ కార్ల తయారీదారులు ఇకపై కార్ క్రాస్ టెస్టింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








