రెనాల్ట్‌ డస్టర్‌ అఫీషియల్ ఫొటోలు లీక్‌.. ఇంటర్నెట్‌లో వైరల్‌, ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌.. నేడు నెక్స్ట్‌ జెన్‌ రెనాల్ట్‌ డస్టర్‌ను ఆవిష్కరించనుంది. పోర్చుగల్‌లో జరిగే ఓ ఈవెంట్‌లో కొత్త డస్టర్‌(Renault duster 2024)ను పరిచయం చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే కొత్త డస్టర్‌కు సంబంధించిన ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లు బయటకు రాగా.. రివీల్‌కు ముందే డస్టర్‌ ఇంటీరియర్‌ ఫొటోలు కూడా లీక్‌ అయ్యాయి.

భారత మార్కెట్లో లాంచ్‌ అయిన తొలి ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్‌.. అప్పట్లో ఈ మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. భారతీయులకు రెనాల్ట్‌ డస్టర్‌ ఒక ఎమోషన్‌ అన్నా ఆశ్చర్యం లేదు. అయితే మార్కెట్లో పోటీని తట్టుకోలేక డస్టర్‌ సేల్స్‌ తగ్గిపోవడంతో ఈ ఎస్‌యూవీని రెనాల్ట్ నిలిపివేసింది. కాగా నేడు నెక్స్ట్‌ జెన్‌(3 వ తరం వెర్షన్‌) డస్టర్‌ను రివీల్‌ చేయనుంది. త్వరలో మార్కెట్లోకి లాంచ్ కానుంది.

Renault-Duster-SUV

కాగా ఇటీవల రెనాల్ట్‌ డస్టర్‌ టీజర్‌ వీడియోలో ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లను రెనాల్ట్‌ వెల్లడించింది. ఇప్పుడు రివీల్‌కు ముందే ఈ కొత్త కారుకు సంబంధించిన అఫీషియల్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఫొటోలను చూస్తే ఇంటీరియర్‌ పరంగా చాలా అప్‌డేట్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా వీటి గురించి పలు ఆసక్తికర విషయాలు..

రెనాల్ట్‌ డస్టర్‌ ఎస్‌యూవీని షార్పర్‌ ఫేస్‌తో అప్‌డేట్‌ చేసినట్లుగా లీకైన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఫ్లాట్‌ బానెట్‌, Y ఆకారంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ యూనిట్‌, కొత్త లుక్‌పై గ్రిల్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కొత్త బంపర్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కొత్త బ్లాక్‌ అవుట్ 10 స్పోక్‌ అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది.

Renault-Duster-SUV

బుల్​ బార్​ తరహా బంపర్​ ఇన్సర్ట్​, సిల్వర్​ ఫౌక్స్​ స్కిడ్​ ప్లేట్​ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా డోర్​ క్లాడింగ్​, స్క్వేర్డ్​ ఆఫ్​ వీల్​ ఆర్చీస్​, రూఫ్​ రెయిల్స్​, ఎక్స్​పాన్సివ్​ గ్లాస్​ ఏరియాస్​, రేర్​ క్వార్టర్​ ప్యానెల్​ వంటిని కొత్త రెనాల్ట్‌ డస్టర్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

ఇక లీక్‌ అయిన ఇంటీరియర్‌ ఫొటోలను పరిశీలిస్తే.. వీటిని అధునాతనంగా అప్‌డేట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త ఫ్రీ ఫ్లోటింగ్‌ టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లేతో పాటు సరికొత్తగా ఏసీ వెంట్లు, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్‌ ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌తో పాటు, USB, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా డ్యూయల్‌ టోన్‌ థీమ్‌తో 5 సీట్‌ డస్టర్‌ను రూపొందించారు.

Renault-Duster-SUV

ఇక కొత్త రెనాల్ట్‌ డస్టర్ ఇంజిన్‌ విషయానికొస్తే దీనిని కనీసం మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో ప్రవేశపెట్టనున్నారు. ఎంట్రీ లెవెల్‌ వేరియంట్లు 1.0 లీటర్‌ టర్బో ఛార్జ్డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తాయి. 120hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 20 hp శక్తి ఉత్పత్తి సామర్థ్యంతో హైబ్రిడ్‌ టెక్నాలజీతో 1.2 లీటర్‌ పెట్రోల్‌ యూనిట్‌ను కలిగి ఉండనుంది.

Renault-Duster-SUV

మూడవది 1.3 లీటర్‌ టర్బో ఛార్జ్డ్‌ ఇంజిన్‌ ఎంపిక. అత్యంత శక్తివంతమైన ఈ ఇంజిన్‌.. ఇథనాల్‌ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. 170 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా రాబోయే నాలుగేళ్లలో 8 కొత్త మోడళ్లను రెనాల్ట్‌ తీసుకురానుంది. వీటిలో మూడు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని సంస్థ తెలిపింది. అఫీషియల్‌ రివీల్‌ తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Renault-Duster-SUV

More from DriveSpark

Article Published On: Wednesday, November 29, 2023, 17:45 [IST]
English summary
Renault duster suv interior official photos leak ahead of debut today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+