భారత్‌లో రోల్స్ రాయిస్ తొలి ఎలక్ట్రిక్ కారు డెలివరీ.. ధర రూ.9 కోట్లు.. ఫోటోలు వైరల్!
రోల్స్ రాయిస్ ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లకు ప్రసిద్ధి. భారత్ మార్కెట్‌లోనూ ఈ కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు. అయితే రోల్స్ రాయిస్ తొలి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్ (Rolls royce spectre electric car) మొదటిసారిగా భారత్‌లో డెలివరీ అయింది.
ఎలక్ట్రిక్ కారు ధర రూ.9 కోట్లు : రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారును చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ రోల్స్ రాయిస్ కారు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అయితే భారత్ మార్కెట్‌లో రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయలేదు. 2024లో ఈ కారు భారత మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో లాంచ్‌పై సంస్థ కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. ఈ కారు ధర రూ.9 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉందని తెలుస్తోంది.
2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్ కార్లే: రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో కొరియన్ మార్కెట్‌లో విడుదల అయింది. రోల్స్ రాయిస్‌కు ఇదే తొలి ఎలక్ట్రిక్ కారు. 2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్ కార్లనే ప్రవేశపెట్టాలని రోల్స్ రాయిస్ సంస్థ భావిస్తోంది.

4.5 సెకన్లలో 100 కి.మీ వేగం: రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 5455 mm పొడవు, 2080 mm వెడల్పు, 1559 mm ఎత్తును కలిగి ఉంటుంది. 3210 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు బీఎండబ్ల్యూ యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.
ఇది గరిష్ఠంగా 576 bhp శక్తి, 900 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌పై 520 కి.మీ (WLTP) రేంజ్‌ను ఇస్తుందని రోల్స్ రాయిస్ చెబుతోంది. దీంతోపాటు ఈ కారు 4.5 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారు ఫ్రంట్ LED DRL మరియు హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 23 అంగుళాల అల్లాయ్ వీల్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన రూఫ్ డిజైన్ సహా LED టెయిల్ లైట్లను కలిగి ఉంది. స్పెక్టర్ సెడాన్ ఆకర్షణీయమైన స్లాంటెడ్ రూఫ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు పెద్ద గ్రిల్‌తో వస్తుంది. కారు డిజైన్ ఆకట్టుకొనేలా ఉంది.
చిరంజీవి, ప్రభాస్ సహా.. : దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు. చిరంజీవి, ప్రభాస్, విజయ్ దళపతి, అక్షయ్ కుమార్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్ ఈ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








