సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

రూపాలి గంగూలీ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, అయితే ఈ పేరు బాలీవుడ్ లో సుపరిచయమే, ఎందుకంటే సినిమాలతో మొదలై సీరియల్స్ తో పాపులర్ అయిపోయింది. ఇటీవల ఈ బుల్లితెర సెలబ్రిటీ ఒక లగ్జరీ కారుని కొనుగులు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

రూపాలి గంగూలీ బిగ్‌బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది, అయితే ఇప్పటికి దాదాపు 20 కి పైగా బాలీవుడ్ సీరియల్స్ లో నటించి అంతకు మించిన గుర్తింపు పొందింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇటీవల ఒక జర్మన్ లగ్జరీ కార్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

రూపాలి గంగూలీ షేర్ చేసిన ఫొటోస్ లో మీరు గమనించినట్లైతే ఇందులో లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ చూడవచ్చు. దీని ధర రూ. 90 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కారుని ఎంత ధరతో కొనుగోలు చేశారనే విషయం స్పష్టంగా అందుబాటులో లేదు. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ ఒకటి. ఇది ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. వాహన వినియోగదారులకు ఉపయోగపడే అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అయితే రూపాలి కొనుగోలు చేసిన ఈ కారు పోలార్ వైట్ కలర్ లో ఉంది. నిజానికి జిఎల్ఈ అనేది వివిధ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

రూపాలి గంగూలీ ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. ఫీచర్స్ విషయానికి వస్తే, బెంజ్ GLE లో డ్యూయల్ 12.3 ఇంచెస్ స్క్రీన్ సెటప్‌ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రెండవది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

పైన తెలిపిన ఫీచర్స్ మాత్రమే కాకుండా, ఇందులో ఎయిర్‌మాటిక్ ఎయిర్ సస్పెన్షన్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ డిజైన్ విషయానికి వస్తే, ఈ లగ్జరీ కారు యొక్క ముందు భాగంలో ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. అంతే కాకుండా ట్రెడిషినల్ ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్‌ ఇక్కడ చూడవచ్చు, దీనికి మధ్య భాగంలో బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంకా ట్విన్ ఐబ్రో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు వెనుక వైపున ఎల్‌ఇడి టైల్ లైట్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ కారు యొక్క డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల చూడగానే ఆకర్షిస్తుంది.

సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?

ఇక రూపాలి షేర్ చేసిన వీడియోలో తన భర్త కొడుకు లతో కలిసి కేక్ కట్ చేయడం, మరియు బెంజ్ GLE డెలివరీ చేసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటివరకు చాలామంది వీక్షించారు, ఇందులో ఎక్కువ మంది అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద బుల్లితెర నటి ఒక ఖరీదైన కారుకి ఓనర్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 30, 2023, 12:31 [IST]
English summary
Rupali ganguly buys benz gle details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+